టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ల సంఖ్య తగ్గిపోతుంది. ఈ రెండేళ్లలో ఎంతోమంది టాలీవుడ్ హీరోలు పెళ్లిచేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అసలు పెళ్లి చేసుకోను అని చెప్పిన రానానే పెళ్లి చేసుకోవడంతోనే చాలా మంది షాకయ్యారు. ఇక ఇప్పుడు ఆ బ్యాచ్ లర్ల్ లో లిస్ట్ లో మొదటి వరుసలో ఉన్న హీరో శర్వానంద్ కూడా ఓ ఇంటివాడయ్యాడు. తెలంగాణ హైకోర్ట్ న్యాయవాది మదుసూదన్ రెడ్డి కుమార్తె, రక్షితారెడ్డితో జనవరిలో శర్వా నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే కదా. ఐదు నెలల తర్వాత ఇప్పుడు వీరి వివాహం జరిగింది. రాజస్థాన్, జైపూర్ లోని శ్రీలీల ప్యాలెస్ లో శర్వానంద్ వివాహ వేడుక ఘనంగా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెండు రోజుల నుండే అక్కడ పెళ్లి సందడి మొదలైంది. హల్దీ ఫంక్షన్, సంగీత వంటి కార్యక్రమాలను నిర్వహించారు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు పెళ్లి కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఈ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివాహ వేడుకకి రెండు కుటుంబాలకు చెందినవారు, సన్నిహితులు, స్నేహితులు సహా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.
ఇక శర్వానంద్ తన సినిమాలతో టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.తన కెరీర్ లో గమ్యం, రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలు శర్వా కు ఎంతో గుర్తింపు సంపాదించి పెట్టాయి. ప్రస్తుతం శర్వా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శర్వానంద్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా ఆయన ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్యతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు శర్వా.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: