‘జెంటిల్మన్’ నిర్మాత కె.టి. కుంజుమోన్’ సౌత్ ఇండియన్ సినిమా ప్రముఖ నిర్మాతలలో ఒకరు. అద్భుతమైన చిత్రాలని నిర్మించిన బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించారు. శరత్‌కుమార్, దర్శకుడు శంకర్ వంటి గొప్ప ప్రతిభావంతులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన అరుదైన రికార్డ్ ఆయన సొంతం. గ్రాండ్ గా సినిమాలను నిర్మించడం, తన సినిమాలను ప్రమోట్ చేయడంలో ప్రత్యేకమైన శైలిని అనుసరించడంలో ఆయన పేరుపొందారు. ఇప్పుడు ‘జెంటిల్మన్ 2’ ద్వారా నిర్మాతగా ఆయన కమ్ బ్యాక్ గురించి ఇండస్ట్రీ, ట్రేడ్ సర్కిల్ మొత్తం ఆనందం వ్యక్తం చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శంకర్ దర్శకత్వంలో అర్జున్, మధుబాల హీరో హీరోయిన్లుగా వచ్చిన జెంటిల్‌మేన్ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఓ సంచలనం సృష్టించింది. అర్జున్ కెరీర్లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. కృష్ణమూర్తి పాత్రలో తన సత్తా చాటాడు. ఇక శంకర్ కూడా తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకున్నాడు. కె.జి. కుంజమోన్ నిర్మించిన ఈ చిత్రం 1993లో విడుదలలైంది. ఇక ఇప్పుడు జెంటిల్‌మేన్‌కు పార్ట్ 2గా, మొదటి భాగానికి రెండింతలు ఉండేలా జెంటిల్‌మేన్ 2 చిత్రాన్ని నిర్మించనున్నారు కే. కుంజుమోన్.
ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన పలు అప్ డేట్లు ఇచ్చిన కుంజుమోన్ తాజాగా మరో అప్ డేట్ ఇచ్చాడు. ఈసినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈనేపథ్యంలో పూర్తి స్క్రిప్ట్‌ను ఎం.ఎం. కీరవాణికి వినిపించడానికి ఫిల్మ్ మేకర్ ఎ. గోకుల్ కృష్ణ హైదరాబాద్ వచ్చారు. కథ గ్రాండియర్ కి చాలా ఇంప్రెస్ అయిన కీరవాణి వచ్చే నెలలోనే కంపోజ్ చేయడం ప్రారంభిస్తానని నిర్మాత కుంజుమోన్ కు చెప్పారు. ఈ చిత్రాన్ని ఇంత గ్రాండ్‌గా నిర్మించబోతున్న నిర్మాత కె.టి. కుంజుమోన్ కు అభినందనలు తెలిపారు కీరవాణి. ‘జెంటిల్మన్-2’ ద్వారా కీరవాణి తమిళ చిత్ర పరిశ్రమకు కమ్ బ్యాక్ ఇస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: