
ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 9

ఆఫ్రికా లో "ప్రతి రోజూ పండగే "
నిఖిల్ కి జోడీగా నభా నటేష్?
బాలకృష్ణ `కథానాయకుడు`కి 35 ఏళ్ళు
బాలకృష్ణకి విలన్ గా శ్రీకాంత్?
వెంకీ మామ మూవీ పబ్లిక్ ఒపీనియన్

"అల .. వైకుంఠపురములో .. " మూవీ టీజర్ రికార్డ్
బాలకృష్ణకి జోడీగా సోనాక్షి సిన్హా?
రజనీకాంత్ 168వ మూవీ ప్రారంభం

"అశ్వథ్థామ" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఖమ్మం లో "వెంకీ మామ " ప్రీ రిలీజ్ ఈవెంట్
హాకీ ఛాంపియన్ పాత్రలో లావణ్య త్రిపాఠి
స్టార్ రైటర్ కోన వెంకట్ మీడియా సమావేశంలో ...
లెజెండరీ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో తాప్సీ

#NANI 26 మూవీ టైటిల్ "టక్ జగదీష్ "
`వెంకీమామ`.. ఇక పాయల్ వంతు
రాశీఖన్నా, థమన్... బ్యాక్ టు బ్యాక్ మూవీస్

"వెంకీ మామ " మూవీ ఫస్ట్ డే రికార్డ్
సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "వెంకీ మామ " మూవీ 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు కాగా నాజర్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
ఆఫ్రికా లో "ప్రతి రోజూ పండగే "
హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు మారుతి దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యం లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ప్రతి రోజూ పండగే " మూవీ డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. సత్యరాజ్, విజయ్ కుమార్, రావు రమేష్, మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటించారు.
నిఖిల్ కి జోడీగా నభా నటేష్?
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ `అర్జున్ సురవరం`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు యువ కథానాయకుడు నిఖిల్. ఒక వైపు ఈ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తూనే... మరోవైపు కొత్త సినిమాలను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు ఈ యంగ్ హీరో. వీటిలో ముందుగా `కార్తికేయ`(2014) చిత్రానికి సంబంధించిన సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళనుంది. `కార్తికేయ`ని తెరకెక్కించిన చందు మొండేటి ఈ కొనసాగింపు చిత్రాన్ని కూడా తెరకెక్కించనున్నాడు.
బాలకృష్ణ `కథానాయకుడు`కి 35 ఏళ్ళు
నటసింహ నందమూరి బాలకృష్ణ, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి... ఈ కాంబినేషన్ అనగానే పలు బ్లాక్ బస్టర్స్ కళ్ళ ముందు కదలాడతాయి. అలాంటి ఈ హిట్ పెయిర్ కలయికలో వచ్చిన తొలి చిత్రం `కథానాయకుడు`. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో `ఊర్వశి` శారద ముఖ్య భూమికను పోషించగా... స్వర్గీయ గొల్లపూడి మారుతీరావు, చంద్రమోహన్, నూతన్ ప్రసాద్, రాజ్యలక్ష్మి, రమాప్రభ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై మూవీ మొఘల్ డి.రామానాయుడు నిర్మించిన ఈ సక్సెస్ ఫుల్ మూవీకి కె.మురళీమోహనరావు దర్శకత్వం వహించాడు. స్వరదిగ్గజం చక్రవర్తి బాణీలు…
బాలకృష్ణకి విలన్ గా శ్రీకాంత్?
బ్లాక్ బస్టర్స్ హిట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలచిన కాంబినేషన్ ల్లో నటసింహ బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను జోడీ ఒకటి. వీరిద్దరి కలయికలో వచ్చిన `సింహా`(2010), `లెజెండ్`(2014) సంచలన విజయం సాధించడమే కాకుండా ఆ యా సంవత్సరాలలో హయ్యస్ట్ గ్రాసర్స్ గా నిలిచాయి. కట్ చేస్తే... ఐదేళ్ళ విరామం అనంతరం ఈ సెన్సేషనల్ కాంబినేషన్ మరోసారి జట్టుకడుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఇటీవలే పూజ జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది.

" కె .జి.ఎఫ్ 2" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ డేట్ ఫిక్స్
HOMBALE ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన " కె .జి.ఎఫ్ చాఫ్టర్ 1" కన్నడ మూవీ 2018 సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. శాండల్ వుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి

"విరాటపర్వం 1992 " మూవీ రానా ఫస్ట్ లుక్ రిలీజ్
సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ " మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వం లో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా 1990 ల కాలంనాటి సామజిక పరిస్థితులు, రాజకీయ అంశాల నేపథ్యం లో యాక్షన్, రొమాంటిక్ డ్రామా, రివల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ ట్యాగ్ లైన్ తో "విరాటపర్వం 1992 " మూవీ రూపొందుతుంది.
వెంకీ మామ మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

"అల .. వైకుంఠపురములో .. " మూవీ టీజర్ రికార్డ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అల .. వైకుంఠపురములో .. " మూవీ జనవరి 12వ తేదీ రిలీజ్ కానుంది. టబు, నివేత పేతురాజ్, సుశాంత్ ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ కు విశేష స్పందన లభించింది.
బాలకృష్ణకి జోడీగా సోనాక్షి సిన్హా?
హిందీ చిత్రం`దబంగ్`(2010)తో కథానాయికగా తొలి అడుగేసింది సోనాక్షి సిన్హా. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ... ఆపై పలు విజయవంతమైన హిందీ చిత్రాల్లో సందడి చేసింది. అంతేకాదు... ఐదేళ్ళ క్రితం విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ `లింగ`తో దక్షిణాదిలో తొలిసారిగా మెరిసింది. కట్ చేస్తే... ఐదేళ్ళ తరువాత మరో దక్షిణాది చిత్రంలో సోనాక్షిని నాయికగా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట.
రజనీకాంత్ 168వ మూవీ ప్రారంభం
సన్ పిక్చర్స్ బ్యానర్ పై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కీర్తి సురేష్ జంటగా సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో రజనీకాంత్ 168 వ మూవీ ఈ రోజు పూజ కార్యక్రమం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి రజనీకాంత్, మీనా, ఖుష్బూ, దర్శకుడు శివ, నిర్మాతలు హాజరయ్యారు.ఈ మూవీ లో మీనా, ఖుష్బూ, ప్రకాష్ రాజ్, సూరి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

"అశ్వథ్థామ" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య, మెహరీన్ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "అశ్వథ్థామ" మూవీజనవరి 31వ తేదీ రిలీజ్ కానుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఒక కొత్త కాన్సెప్ట్ తో "అశ్వథ్థామ" మూవీ రూపొందింది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

"అల .. వైకుంఠపురములో .. " మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన "అల .. వైకుంఠపురములో .. " మూవీ జనవరి 12 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే, నివేత పేతురాజ్ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఖమ్మం లో "వెంకీ మామ " ప్రీ రిలీజ్ ఈవెంట్
సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కె యెస్ రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "వెంకీ మామ " మూవీ డిసెంబర్ 13వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు . థమన్ ఎస్ సంగీతం అందించారు. "వెంకీ మామ " మూవీ లో రియల్ లైఫ్ మామా అల్లుళ్ళు వెంకటేష్, నాగచైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్ళు గా నటించడం విశేషం.
హాకీ ఛాంపియన్ పాత్రలో లావణ్య త్రిపాఠి
వెంకటాద్రి టాకీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై సందీప్ కిషన్ హీరోగా డెన్నిస్ జీవన్ కానుకొలను దర్శకత్వం లో హాకీ నేపథ్యం లో "A 1 ఎక్స్ ప్రెస్ " మూవీ రూపొందుతుంది. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ, రఘు బాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు, హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. హాకీ క్రీడా నేపథ్యంలో రూపొందుతున్న " A 1 ఎక్స్ ప్రెస్" మూవీ టాలీవుడ్ లో ఈ జానర్ లో మొదటి మూవీ. హీరో సందీప్ కిషన్ కూడా ఈ జానర్ లో ఫస్ట్ టైమ్ నటిస్తున్నారు.
స్టార్ రైటర్ కోన వెంకట్ మీడియా సమావేశంలో ...
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్ర లో రూపొందిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్ధం " జనవరి 31 వ తేదీ రిలీజ్ కానుంది. అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన "నిశ్శబ్ధం "మూవీ లో మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్, సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.
లెజెండరీ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో తాప్సీ
ఝుమ్మంది నాదం మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన తాప్సీ పన్ను బ్లాక్ బస్టర్ మూవీ "చష్మే బద్దూర్ " మూవీ తో బాలీవుడ్ కు ఎంటరయ్యారు. తెలుగు మూవీస్ కంటే హిందీ మూవీస్ లో ఎక్కువగా నటిస్తున్నారు. ఛాలెంజింగ్ పాత్రలలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్న తాప్సీ నటించిన బేబీ, పింక్, నామ్ షబానా , సూర్మా, బద్లా , గేమ్ ఓవర్, మిషన్ మంగళ్, శాండ్ కీ ఆంఖ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. బయోపిక్ మూవీస్ లో ఎక్కువగా నటిస్తున్న తాప్సీ మరో బయోపిక్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

#NANI 26 మూవీ టైటిల్ "టక్ జగదీష్ "
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా #NANI 26 మూవీ గా రూపొందనుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ ని "టక్ జగదీష్ " టైటిల్ తో ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాణ సారథ్యం లో రూపొందనున్న "టక్ జగదీష్ " మూవీ కి థమన్ సంగీతం అందిస్తున్నారు.
`వెంకీమామ`.. ఇక పాయల్ వంతు
విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ `వెంకీమామ`. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్... డిసెంబర్ 13న వెంకీ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.
రాశీఖన్నా, థమన్... బ్యాక్ టు బ్యాక్ మూవీస్
డిసెంబర్ 13, డిసెంబర్ 20... ఈ రెండు రోజులు అటు అందాల తార రాశీఖన్నాకి, ఇటు యువ సంగీత సంచలనం థమన్ కి ప్రత్యేకం కానున్నాయి. ఎందుకంటే... ఈ రెండు తేదీల్లో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఆ చిత్రాలే... `వెంకీమామ`, `ప్రతి రోజూ పండగే`.