HOMBALE ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన ” కె .జి.ఎఫ్ చాఫ్టర్ 1″ కన్నడ మూవీ 2018 సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. శాండల్ వుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా కె .జి.ఎఫ్ చాఫ్టర్ 1″ మూవీ సీక్వెల్ ” కె .జి.ఎఫ్ 2″ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. రాఖీ బాయ్ గా నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందిన హీరో యశ్ ఫస్ట్ లుక్ 21వ తేదీ రిలీజ్ కానుంది. ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ తో చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేసింది. ఈ మూవీ లో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సంజయ్ దత్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: