బాల‌కృష్ణకి విల‌న్ గా శ్రీ‌కాంత్?

Versatile Actor Srikanth To Play Villain In Balakrishna Next Movie

బ్లాక్ బ‌స్ట‌ర్స్ హిట్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిల‌చిన కాంబినేష‌న్ ల్లో న‌ట‌సింహ బాల‌కృష్ణ‌, యాక్ష‌న్ మూవీస్ స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను జోడీ ఒక‌టి. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన `సింహా`(2010), `లెజెండ్`(2014) సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా ఆ యా సంవ‌త్స‌రాల‌లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్స్ గా నిలిచాయి. క‌ట్ చేస్తే… ఐదేళ్ళ విరామం అనంతరం ఈ సెన్సేష‌న‌ల్ కాంబినేష‌న్ మ‌రోసారి జ‌ట్టుక‌డుతోంది. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ఇటీవ‌లే పూజ జ‌రుపుకుంది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్ళ‌నుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ ఓ విల‌న్ గా న‌టించ‌నుండ‌గా… మ‌రో విల‌న్ గా శ్రీ‌కాంత్ ఎంపిక‌య్యాడ‌ని టాక్. అంతేకాదు… ఇందులో స‌రికొత్త మేకోవ‌ర్ లో శ్రీ‌కాంత్ ద‌ర్శ‌న‌మిస్తాడ‌ని వినికిడి. కెరీర్ ఆరంభంలో శ్రీ‌కాంత్ ప‌లు నెగ‌టివ్ ట‌చ్ ఉన్న రోల్స్ లో అల‌రించాడు. ఆపై స్టార్ హీరోగా రాణించాడు. ఇక రెండేళ్ళ క్రితం విడుద‌లైన నాగ‌చైత‌న్య `యుద్ధం శ‌ర‌ణం`తో విల‌న్ గా మ‌రో ఇన్నింగ్స్ మొద‌లుపెట్టాడు. ఈ నేప‌థ్యంలో… మ‌ళ్ళీ ఇప్పుడు బాల‌కృష్ణ – బోయ‌పాటి సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా న‌టించ‌నుండ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… ఇదివ‌ర‌కు బాల‌కృష్ణ – బోయ‌పాటి కాంబినేష‌న్ లో వ‌చ్చిన `లెజెండ్`తో విల‌న్ గా ట‌ర్న్ అయిన స్టార్ హీరో జ‌గ‌ప‌తిబాబు కెరీర్ గ్రాఫ్ ఒక్క‌సారిగా మారిపోయింది. దీంతో… శ్రీ‌కాంత్ విష‌యంలోనూ అది రిపీట్ అయ్యే అవ‌కాశం పుష్క‌లంగా ఉంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ స‌ర్కిల్స్ బ‌జ్.

అన్న‌ట్టు… బాల‌కృష్ణ‌కి త‌మ్ముడిగా `శ్రీ‌రామ‌రాజ్యం`లో న‌టించిన శ్రీ‌కాంత్… బోయ‌పాటి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన `స‌రైనోడు`లో ఓ ముఖ్య పాత్ర‌లో క‌నిపించాడు. మ‌రి… ఆ చిత్రాల‌లాగే కొత్త సినిమా కూడా మంచి విజ‌యం సాధిస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 10 =