సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కె యెస్ రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “వెంకీ మామ ” మూవీ డిసెంబర్ 13వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు . థమన్ ఎస్ సంగీతం అందించారు. “వెంకీ మామ ” మూవీ లో రియల్ లైఫ్ మామా అల్లుళ్ళు వెంకటేష్, నాగచైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్ళు గా నటించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజమండ్రి , హైదరాబాద్, వైజాగ్, కశ్మీర్ లలో షూటింగ్ జరుపుకున్న “వెంకీ మామ ” మూవీ వెంకటేష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, ప్రీ టీజర్, ఫస్ట్ గ్లింప్స్ , నాగచైతన్య అల్లుడు బర్త్ డే గ్లింప్స్, రాశీ ఖన్నా బర్త్ డే గ్లింప్స్, పాయల్ రాజ్ పుత్ బర్త్ డే పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “వెంకీ మామ ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లేక్ వ్యూక్లబ్ ,ఖమ్మం లో ఈ రోజు సాయంత్రం 6గంటలకు జరుగనుంది. ఈ మూవీ దర్శక, నిర్మాతలు, నటీనటులతోపాటు టాలీవుడ్ ప్రముఖులు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటారని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: