కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 10

సినిమా వార్తలు

సోలో హీరోగా ర‌వితేజ ఫ‌స్ట్ మూవీ `నీ కోసం`కి 20 ఏళ్ళు

ఒకే చిత్రం ముగ్గురు ప్ర‌ముఖుల `తొలి అడుగు`ల‌కు వేదిక‌గా నిల‌వ‌డం అరుదుగా జ‌రుగుతుంది. అలాంటి సినిమాల్లో `నీ కోసం` ఒక‌టి. ఆ ముగ్గురు ప్ర‌ముఖులు మ‌రెవ‌రో కాదు... మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, స్టార్ డైరెక్ట‌ర్ శ్రీ‌ను వైట్ల‌, స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఆర్పీ ప‌ట్నాయ‌క్.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

నాగ‌చైత‌న్య‌, శేఖ‌ర్ క‌మ్ముల చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్స‌య్యిందా?

యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌, ఫీల్ గుడ్ ఎంట‌ర్ టైన‌ర్స్ స్పెష‌లిస్ట్ శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. `ఫిదా` బ్యూటీ సాయిపల్ల‌వి నాయిక‌గా న‌టిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ప్ర‌స్తుతం మెరుపు వేగంతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంంటోంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాని వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 2న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని తెలిసింది.

Team TFNవాట్సాప్
స్పెషల్

`ఫ‌స్ట్ టైమ్ బ‌ర్త్ డే స్పెష‌ల్స్` తో వ‌స్తున్న స్టార్స్

`విచిత్ర కుటుంబం` (1969)... తెలుగునాట స‌రికొత్త సంప్ర‌దాయానికి శ్రీ‌కారం చుట్టిన చిత్రం. ఇంత‌కీ ఆ సంప్ర‌దాయం ఏంటంటే... లీడ్ రోల్ ప్లే చేసిన `స్టార్` బ‌ర్త్ డే స్పెష‌ల్ గా సినిమా రిలీజ్ కావ‌డం. స‌రిగ్గా యాభై ఏళ్ళ క్రితం మ‌హాన‌టుడు య‌న్టీఆర్ మొద‌లుపెట్టిన ఈ సంప్ర‌దాయాన్ని... ఆపై లెజండ‌రీ యాక్ట‌ర్స్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, కృష్ణ‌, శోభ‌న్ బాబుతో పాటు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున‌, యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్ వంటి స్టార్స్ కొన‌సాగించారు. ఇప్పుడీ వ‌రుస‌లోనే మ‌రో ముగ్గురు స్టార్స్ చేర‌బోతున్నారు. ఆ స్టార్స్ మ‌రెవ‌రో కాదు.. విక్ట‌రీ వెంక‌టేష్‌, మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, `సిసింద్రీ` అఖిల్.

Team TFNవాట్సాప్
Venkatesh to Grace Miss Match Audio Launch,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Miss Match Pre Release Event,Miss Match Movie Pre Release Event,Miss Match Telugu Movie Pre Release Event Highlights
సినిమా వార్తలు

'మిస్ మ్యాచ్' కోసం 'వెంకీమామ'

నిర్మల్ కుమార్ దర్శకత్వంలో ఆట గదరా శివ ఫేమ్ ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న సినిమా 'మిస్ మ్యాచ్'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సిద్ధంగా వుంది. ఈ నెల 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
AMB Cinemas Completes One Successful Year,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,1 Year For AMB Cinemas,One Year Completed For AMB Cinemas,AMB Cinemas Latest News
సినిమా వార్తలు

ఏఎంబీ సినిమాస్ కు హ్యాపీ బర్త్ డే

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మల్టీప్లెక్స్ ప్రారంభించి నేటికి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా ఏఎంబీ సినిమాస్ కు తొలి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వెరీ హ్యాపీ బర్త్ డే ఏషియన్ సినిమాస్ అంటూ ట్వీట్ చేశారు. ఎంతో శ్రమించి ఏఎంబీ సినిమాస్ ను ఈ స్థాయికి తెచ్చిన ఏఎంబీ టీమ్ కు శుభాభినందనలు. ఏఎంబీ సినిమాస్ నేడు ఈ స్థాయిలో ఉందంటే అది మీ చలవే అంటూ స్పందించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తేజ కు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్..!

కెరీర్ మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన 'గోపీచంద్' కు ఇప్పుడు కాలం కలిసి రావట్లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా సక్సెస్ మాత్రం దక్కట్లేదు. గతకొద్ది కాలంగా ప్లాప్స్ తప్పించి సక్సెస్ అనేది చూడలేదు. ఇటీవల వచ్చిన 'చాణక్య' సినిమా అన్న హిట్ అవుతుందనుకున్నాడు.. కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీనితో తన తర్వాత వచ్చే కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Nani New Movie Title To Be Unveiled Tomorrow,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Natural Star Nani Latest News,Nani New Movie Updates,Nani Upcoming Film News,Nani Next Project Details,Nani New Mov
సినిమా వార్తలు

#Nani26 రేపు రిలీజ్ చేయనున్న టైటిల్

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ V మూవీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. సుధీర్ బాబు , నివేత థామస్, అదితి రావు హైదరి ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీన రిలీజ్ కానుంది.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

ఫైనల్లీ 'వెంకీమామ' రిలీజ్ డేట్ ఫిక్స్

బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా 'వెంకీమామ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయినా సాంగ్స్ , టీజర్ , స్టిల్స్ కు అభిమానులను నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక గత కొంత కాలంగా బిగ్ సస్పెన్స్ నడుస్తున్న విషయం తెలిసిందే. ముందు డిసెంబర్ లోనే రిలీజ్ అన్నారు. ఆ తర్వాత సంక్రాంతి అన్నారు. దీనితో మామా అల్లుళ్ళు ఎప్పుడు వస్తారా అని కన్ఫ్యూజన్ కూడా అభిమానుల్లో నెలకొంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'శ్రీదేవి' జీవిత చ‌రిత్ర‌ పుస్తక ఆవిష్కరణ

బాల నటిగా సినీ రంగంలోకి ప్రవేశించి.. ఆ తర్వాత హీరోయిన్‌గా తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి.. వెండి తెరపై తన అందం అభినయంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న నటి శ్రీదేవి. వెండితెరపై ఎంతో మంది హీరోయిన్స్ వచ్చినా.. అతిలోకసుందరి అంటే అందరి మదిలో మెదిలే రూపం శ్రీదేవిదే. అంతేకాదు భారతీయ చిత్ర పరిశ్రమలో ఓ నటిగా చెరగని ముద్ర వేసింది శ్రీదేవి. ఆమె ఈ లోకాన్ని వీడి దాదాపు రెండేళ్లు కావొస్తోంది.

TFN Adminవాట్సాప్
సాంగ్

'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో వుంది. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క వెంట వెంటనే అప్ డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్ లో ఇప్పటినుండే జోరు పెంచారు. ఇక ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేసిన చిత్ర బృందం.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఫస్ట్ లిరికాల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'మైండ్ బ్లాక్' అంటూ వచ్చే పాటను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Nishabdham Movie Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

" నిశ్శబ్ధం "మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో, హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ " నిశ్శబ్ధం " 2020 సంవత్సరం జనవరి 31 వ తేదీ రిలీజ్ కానుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్,సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. సియోటెల్ లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకొన్న హాలీవుడ్ క్రాస్ ఓవర్ మూవీ " నిశ్శబ్ధం "పలు భాషలలో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Senior Writer Planning For RGV Biopic,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Jonnavithula Ramalingeswara Rao Planning For RGV Biopic,RGV Biopic Latest News,RGV Biopic Live Updates,Jonnavithula Ramali
సినిమా వార్తలు

బయోపిక్ కు ప్లాన్ చేస్తున్న ప్రముఖ రచయిత..?

రామ్ గోపాల్ వర్మకు ప్రముఖ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వరరావు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రంపై ఓ ఛానెల్‌లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో జొన్నవిత్తుల కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఫోన్ కాల్ లో మాట్లాడుతూ వర్మ డిబేట్ మధ్యలోనే బ్రేక్ చెప్పి వెళ్లిపోవడంతో జొన్నవిత్తుల ఆగ్రహం చేశారు. ఆయనపై కొన్ని అనూహ్య కామెంట్లు చేశారు. మరి వర్మ సైలెంట్ గా ఉండడు కదా.. ఆయనపై కొన్ని కామెడీ ట్వీట్స్ చేశారు. ఇక అప్పటినుండి వీళ్లిద్దరి మధ్య వార్ నడుస్తూనే వుంది. అంతేకాదు అందరి బయోపిక్ లు తీస్తున్న వర్మ బయోపిక్ ను తాను తీస్తా అని చెప్పిన సంగతి…

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'ప్రతిరోజూ పండగే' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మారుతి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్ ను, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. డిసెంబర్ 4వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తనీష్ 'మహాప్రస్థానం'

చైల్డ్ ఆర్టిస్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఆతర్వాత హీరోగా మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టిన నటుడు తనీష్. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన అవేమీ పెద్దగా ఆడలేదని చెప్పొచ్చు. ఇక కొంతకాలం గ్యాప్ ఇచ్చి గత ఏడాది బిగ్ బాస్ షో లో కూడా పాల్గొని సందడి చేశాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు మళ్ళీ ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు తనీష్.

TFN Adminవాట్సాప్
Singer Rahul Sipligunj Plays A Pivotal Role In Rangamarthanda,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Rangamarthanda Movie Updates,Rangamarthanda Telugu Movie Latest News,Rahul Sipligunj Role In Ranga
సినిమా వార్తలు

"రంగమార్తాండ " మూవీ లో నటుడు గా రాహుల్ సిప్లిగంజ్

సూపర్ హిట్ మూవీస్ ఈగ, రచ్చ, రంగస్థలం, కాంచన 3, RX 100, ఇస్మార్ట్ శంకర్ వంటి మూవీస్ లో తన సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు నటుడిగా అలరించనున్నారు. బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 3 టైటిల్ గెలుచుకొన్న రాహుల్ సింగర్ గానూ, నటుడి గానూ పలు అవకాశాలను అందుకొంటున్నారు. ఇప్పుడు రాహుల్ "రంగమార్తాండ " మూవీ లో ఒక కీలక పాత్ర లో నటిస్తున్నట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Allu Arjun Samajavaragamana Song Sets New Records On Youtube,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Samajavaragamana Song Latest News,Stylish Star Allu Arjun Samajavaragamana Song Creates New Record
సాంగ్

" సామజవరగమన" సాంగ్ రికార్డ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న "అల .. వైకుంఠపురం లో .." మూవీ జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు . మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ మూడు సాంగ్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గోదావ‌రి నేప‌థ్యంలో నాని, శివ చిత్రం?

`నిన్ను కోరి` వంటి స‌క్సెస్ ఫుల్ మూవీ త‌రువాత నేచుర‌ల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. `పెళ్ళి చూపులు` ఫేమ్ రీతూ వ‌ర్మ నాయిక‌గా న‌టించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మించ‌నున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

యాక్ష‌న్ మోడ్ లో `క్రాక్`

`బ‌లుపు` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, స్ట‌న్నింగ్ బ్యూటీ శ్రుతి హాస‌న్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని, యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ థ‌మ‌న్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా `క్రాక్`. ప్ర‌ముఖ నిర్మాత `ఠాగూర్` మ‌ధు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ర‌వితేజ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు. వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కుతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`అర్జున్ సుర‌వరం`కి అచ్చొచ్చిన సెంటిమెంట్స్

ఫేక్ స‌ర్టిఫికేట్ స్కామ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ `అర్జున్ సుర‌వ‌రం`... శుక్ర‌వారం (న‌వంబ‌ర్ 29) జ‌నం ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ `క‌ణిత‌న్` ఆధారంగా రూపొందిన ఈ యాక్ష‌న్ డ్రామా... ప‌లుమార్లు వాయిదా ప‌డి.. ఎట్టకేల‌కు ఏడాదికిపైగా ఆల‌స్యంగా విడుద‌లకు నోచుకుంది. అయిన‌ప్ప‌టికీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో... `అర్జున్ సుర‌వ‌రం`కి స‌ర్వ‌త్రా మంచి స్పంద‌న వ‌చ్చింది. కొన్ని ఏరియాల్లో థియేట‌ర్ల సంఖ్య‌ను పెంచ‌డం చూస్తే... ఈ సినిమాకి రోజు రోజుకి క్రేజ్ పెరుగుతుంద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రామానాయుడు స్టూడియోస్ లో `భీష్మ‌`

`ఛ‌లో` వంటి స‌క్సెస్ ఫుల్ మూవీ తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన వెంకీ కుడుముల‌... స్వ‌ల్ప విరామం త‌రువాత త‌న రెండో చిత్రాన్ని `భీష్మ‌`గా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. యువ క‌థానాయ‌కుడు నితిన్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్నా నాయిక‌గా న‌టిస్తోంది.

Team TFNవాట్సాప్

షేర్