బాల‌కృష్ణ `క‌థానాయ‌కుడు`కి 35 ఏళ్ళు

Balakrishna Kathanayakudu Completes 35 Years

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి… ఈ కాంబినేష‌న్ అన‌గానే ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్స్ క‌ళ్ళ ముందు క‌ద‌లాడ‌తాయి. అలాంటి ఈ హిట్ పెయిర్ క‌ల‌యిక‌లో వ‌చ్చిన తొలి చిత్రం `క‌థానాయ‌కుడు`. ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాలో `ఊర్వ‌శి` శార‌ద ముఖ్య భూమిక‌ను పోషించ‌గా… స్వ‌ర్గీయ గొల్ల‌పూడి మారుతీరావు, చంద్ర‌మోహ‌న్, నూత‌న్ ప్ర‌సాద్, రాజ్య‌ల‌క్ష్మి, ర‌మాప్ర‌భ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మూవీ మొఘ‌ల్ డి.రామానాయుడు నిర్మించిన ఈ స‌క్సెస్ ఫుల్ మూవీకి కె.ముర‌ళీమోహ‌న‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. స్వ‌ర‌దిగ్గ‌జం చ‌క్ర‌వ‌ర్తి బాణీలు అందించాడు. 1984 డిసెంబ‌ర్ 14న రిలీజైన `క‌థానాయ‌కుడు` నేటితో 35 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

`క‌థానాయ‌కుడు` – కొన్ని విశేషాలు:

* బాల‌కృష్ణ‌, డి.రామానాయుడు కాంబినేష‌న్ లో వ‌చ్చిన తొలి చిత్రం ఇది. ఆ త‌రువాత ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన `రాము`(1987) కూడా మంచి విజ‌యం సాధించింది. ఈ రెండు చిత్రాలు కూడా మ‌హాన‌టుడు య‌న్టీఆర్ న‌టించిన‌ క్లాసిక్ అండ్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ టైటిల్స్ తోనే తెర‌కెక్కి విజ‌యం సాధించ‌డం విశేషం. అలాగే ఈ రెండు సినిమాల్లోనూ శార‌ద ముఖ్య భూమిక పోషించ‌డం మ‌రో విశేషం.

* `క‌థానాయ‌కుడు` త‌రువాత బాల‌కృష్ణ‌, విజ‌య‌శాంతి కాంబినేష‌న్ లో మ‌రో ప‌ద‌హారు చిత్రాలు సంద‌డి చేశాయి. వీటిలో `ప‌ట్టాభిషేకం`(1985), `ముద్దుల కృష్ణ‌య్య‌`, `అపూర్వ స‌హోద‌రులు`(1986), `భార్గ‌వ రాముడు`(1987), `ఇన్స్ పెక్ట‌ర్ ప్ర‌తాప్`(1988), `భ‌లే దొంగ‌`, `ముద్దుల మావ‌య్య‌`(1989), `లారీ డ్రైవ‌ర్`(1990), `త‌ల్లిదండ్రులు`(1991), `రౌడీ ఇన్స్ పెక్ట‌ర్`(1992) వంటి హిట్స్, సూప‌ర్ హిట్స్ ఉన్నాయి. ఇక వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన చివ‌రి చిత్రం `నిప్పుర‌వ్వ‌`(1993). యువ‌ర‌త్న ఆర్ట్స్ ప‌తాకంపై వీరి చివ‌రి కాంబినేష‌న్ ఫిల్మ్ రూపొంద‌డం విశేషం.

* `క‌థానాయ‌కుడు` రిలీజైన రోజే ఆ చిత్ర నిర్మాత డి.రామానాయుడుకి మ‌న‌వ‌డు, ప్ర‌ముఖ న‌టుడు రానా ద‌గ్గుబాటి కూడా జ‌న్మించ‌డం (1984 డిసెంబ‌ర్ 14) మ‌రో విశేషం.

* `కథానాయ‌కుడు`ని `దిల్ వాలా`(1986) పేరుతో హిందీలో రీమేక్ చేయ‌గా… ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్ ప్రొడ్యూస‌ర్ డి.రామానాయుడు, ద‌ర్శ‌కుడు కె.ముర‌ళీమోహ‌న‌రావు కాంబినేష‌న్ లోనే ఈ సినిమా తెర‌కెక్కింది. మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, మీనాక్షి శేషాద్రి, స్మితా పాటిల్ ఇందులో ముఖ్య పాత్ర‌లు పోషించారు. హిందీనాట మాత్రం ఈ చిత్రం యావ‌రేజ్ గా ఆడింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + one =