ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 8

25 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న `క్రాక్`
వారం గ్యాప్ లో వస్తున్న మామాఅల్లుళ్ళు

త్రివిక్రమ్ తోనే తర్వాత సినిమా..!

'పింక్' తర్వాత 'పవన్' ముల్టీస్టారర్..?
'ఇద్దరి లోకం ఒకటే' ట్రైలర్ రిలీజ్

ఈసారి క్రైమ్ డ్రామా..!

"అతడే శ్రీమన్నారాయణ" మూవీ 5 భాషల రిలీజ్ డేట్స్
సూపర్ స్టార్స్ 'యూ ట్యూబ్' వార్
సత్యరాజ్ డబుల్ ధమాకా
అజిత్ కి విలన్ గా కార్తికేయ?
అనుష్కతో పోటీ పడుతున్న నాగశౌర్య
ఆ దర్శకుడికి మరో ఛాన్స్ ఇస్తున్న బాలకృష్ణ?
`వెంకి మామ` దర్శకుడితో అల్లు అర్జున్?

`రంగమార్తాండ`లో శివాత్మికా రాజశేఖర్?

`పింక్` రీమేక్ లో అంజలి?

14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో #NC 20 మూవీ
యన్టీఆర్ లక్కీ డేట్ కి బాలయ్య `రూలర్`
నటసింహ నందమూరి బాలకృష్ణకి తన తండ్రి, మహానటుడు నందమూరి తారక రామారావు పాత చిత్రాల తాలూకు టైటిల్స్, డేట్స్ పలు సందర్భాల్లో కలిసొచ్చాయి. ఈ నేపథ్యంలోనే... తండ్రి యన్టీఆర్ కి అచ్చొచ్చిన డేట్ నే టార్గెట్ చేసుకుని బాలయ్య తాజా చిత్రం `రూలర్` కూడా రాబోతోంది.

25 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న `క్రాక్`
`డాన్ శీను`, `బలుపు` చిత్రాల తరువాత మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. `క్రాక్` పేరుతో రూపొందుతున్న ఈ కాప్ స్టోరీలో రవితేజకి జోడీగా శ్రుతి హాసన్ నటిస్తుండగా... యువ సంగీత సంచలనం థమన్ బాణీలను అందిస్తున్నాడు. `ఠాగూర్` మధు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నాడు.
వారం గ్యాప్ లో వస్తున్న మామాఅల్లుళ్ళు
2020 పొంగల్... తమిళ తంబీలకు ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే... ఈ సారి సంక్రాంతికి కోలీవుడ్ మామాఅల్లుళ్ళు బాక్సాఫీస్ వద్ద వినోదాలు పంచడానికి సిద్దమయ్యారు. వారం రోజుల గ్యాప్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ థియేటర్లలో సందడి చేయనుండడం కోడంబాక్కం లో హాట్ టాపిక్ గా మారింది.

త్రివిక్రమ్ తోనే తర్వాత సినిమా..!
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక గతకొద్ది కాలంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా వున్న ఎన్టీఆర్ కూడా తన తర్వాత సినిమా కోసం ఇప్పటినుండే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ తన తర్వాత సినిమాను త్రివిక్రమ్ తో చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దీనిపై ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయట. స్క్రిప్ట్ పనులు త్వరలోనే మొదలుపెట్టనున్నాడట త్రివిక్రమ్. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
'అల వైకుంఠపురములో' స్పెషల్ టార్గెట్ ఫిక్స్ చేసిన త్రివిక్రమ్..!
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా' పాటలు రిలీజ్ చేయగా వాటికీ ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దానికి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో.. సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

'పింక్' తర్వాత 'పవన్' ముల్టీస్టారర్..?
అమితాబ్, తాప్సీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన బాలీవుడ్ హిట్ చిత్రం 'పింక్' ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇదే సినిమాను తమిళంలో 'నెర్కొండ పార్వాయి' అనే టైటిల్‌తో.. అజిత్ ప్రధాన పాత్రలో తమిళ్ లో రీమేక్ చేయగా అక్కడ కూడా హిట్ కొట్టింది. ఇప్పుడు తెలుగులోను పింక్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. హిందీలో అమితాబ్ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌కల్యాణ్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బోనీ కపూర్, దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ…
'ఇద్దరి లోకం ఒకటే' ట్రైలర్ రిలీజ్
'లవర్ ' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని కొత్త సినిమాతో రాబోతున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ హీరో గా, అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే హీరోయిన్ గా.. జి.ఆర్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'ఇద్దరి లోకం ఒకటే'. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను పాటలను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఈసారి క్రైమ్ డ్రామా..!
ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ వంగ. విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరో హీరోయిన్లు గా తెలుగులో 'అర్జున్ రెడ్డి' సినిమాతో సంచలన విజయం సాధించి కొత్త ట్రెండ్ కు నాంది పలికాడు. ఇక ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా ఇదే సినిమాను షాహిద్ కపూర్, కియారా అద్వాని హీరో హీరోయిన్లు గా హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. కబీర్ సింగ్ మూవీ ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో షాహిద్ కపూర్ సినీ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది.

"అతడే శ్రీమన్నారాయణ" మూవీ 5 భాషల రిలీజ్ డేట్స్
"అవనే శ్రీమన్నారాయణ " కన్నడ మూవీ 5భాషలలో రిలీజ్ కానుంది. పుష్కర్ ఫిల్మ్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు సచిన్ దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా రూపొందిన ఫాంటసీ, అడ్వెంచర్, కామెడీ "అవనే శ్రీమన్నారాయణ " కన్నడ మూవీ డిసెంబర్ 27 వ తేదీ కన్నడం లో రిలీజ్ కానుంది. శాన్వి కథానాయిక. అజనీష్ లోక్ నాథ్ ,చరణ్ రాజ్ సంగీతం అందించారు.
సూపర్ స్టార్స్ 'యూ ట్యూబ్' వార్
తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్, టాలీవుడ్ సూపర్ స్టార్ మధ్య యూ ట్యూబ్ వార్ ఏంటబ్బా అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. మహేష్ బాబు హీరో అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశకు వచ్చిన ఈ సినిమా అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేసింది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా ప్రతి సోమవారం ఈ సినిమా నుండి ఒక్కో పాటను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ' హీ ఈజ్ సో క్యూట్' అనే పాటను రిలీజ్ చేశారు.

"సరిలేరు నీకెవ్వరు " మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ జనవరి 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించగా, మిల్కీ బ్యూటీ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
సత్యరాజ్ డబుల్ ధమాకా
`బాహుబలి` సిరీస్ లో కట్టప్పగా అలరించిన సత్యరాజ్... ఆ ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తనకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా... తెలుగునాట సత్యరాజ్ కి ఎనలేని కీర్తిప్రతిష్ఠలు అందించింది సదరు కట్టప్ప పాత్ర. ఈ నేపథ్యంలో... సత్యరాజ్ నుంచి ఓ సినిమా వస్తుందంటేనే ప్రత్యేక ఆసక్తి నెలకొంటోంది.
అజిత్ కి విలన్ గా కార్తికేయ?
గత ఏడాది `ఆర్ ఎక్స్ 100` రూపంలో సెన్సేషనల్ హిట్ అందుకున్న యువ కథానాయకుడు కార్తికేయ... ఈ సంవత్సరం ఏకంగా నాలుగు చిత్రాలతో (హిప్పీ, గుణ 369, గ్యాంగ్ లీడర్, 90 ML) సందడి చేశాడు. వీటిలో `గ్యాంగ్ లీడర్`లో పోషించిన విలన్ రోల్... కార్తికేయకి ప్రత్యేక గుర్తింపుని తీసుకువచ్చింది. తనలోని టాలెంట్ ని కొత్త కోణంలో ఆవిష్కరించింది.
అనుష్కతో పోటీ పడుతున్న నాగశౌర్య
వచ్చే ఏడాది జనవరి 31న ఆసక్తికరమైన పోటీ నెలకొంటోంది. ఎందుకంటే... అదే రోజున రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. ఆ చిత్రాలే... `నిశ్శబ్దం`, `అశ్వథ్థామ`.
ఆ దర్శకుడికి మరో ఛాన్స్ ఇస్తున్న బాలకృష్ణ?
`అధినాయకుడు` (2012)... నటసింహ బాలకృష్ణ కెరీర్ లో ప్రత్యేకంగా నిలచిన చిత్రం. ఇందులో మూడు తరాలకు చెందిన మూడు విభిన్న పాత్రల్లో నటించి అలరించాడు బాలయ్య. అలాగే త్రిపాత్రాభినయంలో తనదైన ముద్రవేశాడు. అలాంటి... `అధినాయకుడు`కి దర్శకత్వం వహించిన పరుచూరి మురళి డైరెక్షన్ లో బాలయ్య ఎనిమిదేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు... వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముందని టాక్.
`వెంకి మామ` దర్శకుడితో అల్లు అర్జున్?
`పవర్`తో దర్శకుడిగా పరిచయమైన బాబీ అలియాస్ కె.యస్. రవీంద్ర... అనంతరం `సర్దార్ గబ్బర్ సింగ్`, `జై లవ కుశ` చిత్రాలతో అలరించాడు. ఇక తాజాగా విడుదలైన తన మల్టీస్టారర్ మూవీ `వెంకి మామ` వసూళ్ళ వర్షం కురిపిస్తూ విజయపథంలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలో... బాబీ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బాలయ్య బర్త్ డే స్పెషల్ గా బోయపాటి ఫిల్మ్?
నటసింహ నందమూరి బాలకృష్ణది 45 ఏళ్ళ నటనాప్రస్థానం. అయితే, ఈ ప్రయాణంలో ఇప్పటివరకు తన బర్త్ డే స్పెషల్ గా సినిమాలు రిలీజైన సందర్భాలు లేవు. ఎట్టకేలకు అభిమానులకు ఆ ముచ్చటా తీరే అవకాశం ఉందని వినిపిస్తోంది.

`రంగమార్తాండ`లో శివాత్మికా రాజశేఖర్?
`దొరసాని`తో కథానాయికగా తొలి అడుగు వేసింది రాజశేఖర్ - జీవిత గారాలపట్టి శివాత్మిక. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ గర్ల్ కి... ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం దక్కిందని ఫిల్మ్ నగర్ టాక్.

`పింక్` రీమేక్ లో అంజలి?
హిందీ బ్లాక్ బస్టర్ మూవీ `పింక్` తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీగా తెరకెక్కనున్న ఈ ఎమోషనల్ కోర్ట్ డ్రామాని `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. `దిల్` రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నాడు.

14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో #NC 20 మూవీ
హీరో నాగచైతన్య , వెంకటేష్ తో కలసి నటించిన మల్టీ స్టారర్ మూవీ "వెంకీమామ " ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. నాగచైతన్య ప్రస్తుతం ఫీల్ గుడ్ మూవీస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న #NC 19 మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అందమైన ప్రేమకథ గా రూపొందుతున్న ఈ మూవీలో నాగచైతన్య తెలంగాణ యువకుడిగా నటిస్తున్నారు. నాగచైతన్య బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ , గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.