
ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 81


ఇస్మార్ట్ శంకర్ కి ఇ'స్మార్ట్ హీరోయిన్' ఫిక్స్

షూటింగ్ పూర్తి - మంచి లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్


యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

మరో మెగా హీరో కూడా కలిసొస్తాడా?

అనిల్ రావిపూడి సరికొత్త ట్రాక్ రికార్డు

మధ్య తరగతి అమ్మాయిగా రకుల్

బన్నీ తరువాత వెంకీతోనే...

ఈ ఏడాది కళ్యాణ్ రామ్‌కి ఎంతో స్పెషల్

నానికి జోడీగా `వింక్` బ్యూటీ?

మరోసారి దేవిశ్రీ ప్రసాద్‌తోనే...

`రన్ రాజా రన్`, `సాహో` తరువాత కూడా...

వరుణ్ తేజ్‌కిదే మొదటిసారి

దర్శకుడిగా మారుతున్న మాధవన్

సెన్సార్ పూర్తి చేసుకున్న Mr. మజ్ను

చిరు-కొరటాల మూవీ రూమర్లు నమ్మొద్దు

మహర్షి చివరి షెడ్యూల్ అప్ డేట్

మహర్షి షెడ్యూల్ అప్ డేట్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈసినిమాను సమ్మర్ లో ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. గత కొద్దిరోజులుగా పొల్లాచ్చి, తమిళనాడు లో షూటింగ్ జరుపుకుంటుండగా.. ఈరోజుతో అక్కడి షెడ్యూల్ పూర్తయింది. తరువాత షెడ్యూల్ ఫిబ్రవరి నుండి మొదలుకానుంది.

ఇస్మార్ట్ శంకర్ కి ఇ'స్మార్ట్ హీరోయిన్' ఫిక్స్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాను లాంఛనంగా ఇటీవలే ప్రారంభించంగా..ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ ఎవరనే దానిపై పలు రూమర్లు షికారు చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరో చెప్పారు చిత్రయూనిట్. రామ్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ఫైనల్ అయినట్టు ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు.

షూటింగ్ పూర్తి - మంచి లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్
7 /జి బృందావన్ కాలనీ ఫేమ్ సెల్వరాఘవన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా 'ఎన్ జి కె'. తమిళ సూపర్ స్టార్ హీరో సూర్య , రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి హీరోయిన్లుగా తమిళ్ తో పాటు తెలుగులోనూ ఏకకాలంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా తాజా అప్ డేట్ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమాలో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని రకుల్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తూ తెలిపింది. సెల్వరాఘవన్, సూర్య సర్ తో పనిచేయడం ఓ మంచి లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ అంటూ.. తన షూటింగ్ పార్ట్ పూర్తయిందంటూ ట్వీట్ చేసింది.

నేను గోల్డ్ ఇస్తే కంగనా దాన్ని సిల్వర్ గా మార్చేసింది - డైరెక్టర్ క్రిష్ ఆవేదన
డైరెక్టర్ క్రిష్ అనగానే మన కళ్ళ ముందు గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం,కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి సెన్సిబుల్ సెన్సేషన్స్ కదలాడుతాయి. దర్శకుడిగా తన చిత్రాల ద్వారానే కాకుండా వ్యక్తిగా తన ప్రవర్తన ద్వారా కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును సంపాదించుకున్నారు క్రిష్. వివాదాలు, పరుషపదజాలం వంటి హార్ష్ బిహేవియర్ క్రిష్ లో మనకు మచ్చుకైనా కనిపించదు.అలా అందరితో సౌమ్యుడు, సహృదయుడు అని అభినందనలు అందుకునే క్రిష్ కు కూడా కోపం వచ్చింది అంటే అది నిజంగా సంచలనమే అనుకోవాలి. అందులోనూ ఆడవాళ్లను గౌరవిస్తూ , స్త్రీ పాత్రలను సమున్నతంగా ఆవిష్కరించే క్రిష్ కోపానికి, ఆవేదనకు ఒక స్త్రీ కారణం కావడం ఇంకా…

యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
రాజకీయనాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో .. మహి వి రాఘవ్ దర్శకత్వంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. వైఎస్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా... ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన సాయంత్రం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను ఫిక్స్ చేశారు. అంతేకాదు యూఏస్ లో కూడా ప్రీ రిలీజ్…

మరో మెగా హీరో కూడా కలిసొస్తాడా?
రాశి కంటే వాసికే ప్రాధాన్యమిచ్చే దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. 13 ఏళ్ళ కెరీర్‌లో 6 చిత్రాలే డైరెక్ట్ చేశాడాయన. ముఖ్యంగా మెగా హీరోలతో హరీష్ రూపొందించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో హరీష్ శంకర్ రూపొందించిన `గబ్బర్ సింగ్` అప్పట్లో సంచలన విజయం సాధించింది. హిందీ చిత్రం `దబాంగ్`కి రీమేక్‌గా రూపొంది ఇక్కడి వారిని కూడా ఎంతగానో ఎంటర్‌టైన్ చేసింది. ఇక ఇదే మెగా కాంపౌండ్‌కి చెందిన సాయిధరమ్ తేజ్‌తో `సుబ్రమణ్యం ఫర్ సేల్`ని తెరకెక్కించి మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు హరీష్. అలాగే స్టైలిష్ స్టార్…

అనిల్ రావిపూడి సరికొత్త ట్రాక్ రికార్డు
వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి. నాలుగేళ్ళ క్రితం విడుదలైన `పటాస్` చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేసిన అనిల్... ఆ తరువాత `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్` చిత్రాలతోనూ మెప్పించాడు. ఇక తాజాగా విడుదలైన `ఎఫ్ 2` ఈ ఏడాది తొలి బ్లాక్‌బస్టర్‌గా నిలచింది. అంతేకాదు... వంద కోట్ల గ్రాస్ క్లబ్‌లోనూ చేరిపోయింది... మీడియం బడ్జెట్ సినిమాల పరంగా కొత్త రికార్డుని సృష్టించింది. ఇదిలా ఉంటే... తన తొలి నాలుగు చిత్రాలతో అనిల్ ఓ కొత్త రికార్డు సొంతం చేసుకున్నాడు. అదేమిటంటే... తన ప్రతి చిత్ర కథానాయకుడికి కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్‌ని అందించాడు అనిల్.

మధ్య తరగతి అమ్మాయిగా రకుల్
ఈ ఏడాది అంతా వరుస సినిమాలతో సందడి చేయబోతోంది ఉత్తరాది సోయగం రకుల్ ప్రీత్ సింగ్. ఈ సంక్రాంతికి విడుదలైన `యన్.టి.ఆర్. కథానాయకుడు`లో అతిలోక సుందరి శ్రీదేవిగా అతిథి పాత్రలో దర్శనమిచ్చిన రకుల్... ఫిబ్రవరిలో `దేవ్`తో పలకరించనుంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్ డే స్పెషల్‌గా రానున్న `దేవ్`... ఓ ట్రావెల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. `ఖాకి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత కార్తితో జోడీకట్టిన ఈ సినిమాలోనూ... రకుల్ నటనకు అవకాశమున్న పాత్రలో కనిపించనుందట. అంతేకాదు... ఈ సినిమాలో మేఘన అనే మధ్యతరగతి అమ్మాయి పాత్రలో రకుల్ దర్శనమివ్వనుందని సమాచారం. కొత్త…

బన్నీ తరువాత వెంకీతోనే...
విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో `నువ్వు నాకు నచ్చావ్`, `మల్లీశ్వరి` చిత్రాలకు ప్రత్యేక స్థానముంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలుగా రూపొందిన ఈ సినిమాల్లో వెంకీ కామెడీ టైమింగ్ ఆయన అభిమానులనే కాదు... సగటు ప్రేక్షకులను కూడా అలరించింది. ఈ రెండు సినిమాలకు మరో కామన్ పాయింట్... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన సంభాషణలు. త్రివిక్రమ్ మాటలతో వెంకీ ప్రేక్షకులను భలేగా నవ్వించాడు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందంటూ ఆ మధ్య హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది. అయితే... త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ తొలిసారిగా…

బాలకృష్ణ, బోయపాటి మూవీ అప్‌డేట్
నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన `సింహా`, `లెజెండ్` బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. దాదాపు ఐదేళ్ళ విరామం తరువాత వీరిద్దరి కలయికలో మరో చిత్రం రాబోతోంది. గత రెండు చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలోనూ బాలయ్యని పవర్‌ఫుల్ రోల్‌లో చూపించబోతున్నాడట బోయపాటి.

ఈ ఏడాది కళ్యాణ్ రామ్‌కి ఎంతో స్పెషల్
కథానాయకుడిగా నందమూరి కళ్యాణ్ రామ్‌ది దాదాపు 16 ఏళ్ళ సినీ ప్రస్థానం. రాశి కంటే వాసికే ప్రాధాన్యమిచ్చే ఈ టాలెంటెడ్ హీరో... ఈ 16 ఏళ్ళలో కేవలం 16 చిత్రాలకే పరిమితమయ్యాడు. అంతేకాదు... కెరీర్ మొత్తమ్మీద... 2003, 2007, 2015, 2018 సంవత్సరాల్లో మాత్రమే కళ్యాణ్ రామ్... ఒకే ఏడాదిలో రెండేసి సినిమాలతో పలకరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే... ఈ ఏడాది మాత్రం కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా నాలుగు చిత్రాలతో అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడీ నందమూరి హీరో. అంతేకాదు... వరుసగా మూడు నెలల పాటు తన సినిమాలు విడుదలవుతుండడం విశేషం.

నానికి జోడీగా `వింక్` బ్యూటీ?
ఒకే ఒక్క `వింక్`తో... గత ఏడాది సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది కేరళకుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ ముద్దుగుమ్మ నటించిన మలయాళ చిత్రం `ఒరు అడార్ లవ్`... `లవర్స్ డే`గా తెలుగులోనూ అనువాదం కానుంది. ఇదిలా ఉంటే... ఈ `వింక్` బ్యూటీకి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం వచ్చిందని టాలీవుడ్ టాక్. నేచురల్ స్టార్ నాని హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నుంచి పట్టాలెక్కనున్న ఈ సినిమాలో ఐదుగురు కథానాయికలకు స్థానముందని... అందులో ఒకరిగా ఇప్పటికే మేఘా ఆకాష్ ఎంపికయ్యిందని ఆ మధ్య వార్తలు…

మరోసారి దేవిశ్రీ ప్రసాద్‌తోనే...
సంక్రాంతి కానుకగా విడుదలైన `ఎఫ్ 2`... యువ కథానాయకుడు వరుణ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలచింది. ప్రస్తుతం ఈ మెగా ప్రిన్స్... తమిళ హిట్ చిత్రం `జిగర్తండా` ఆధారంగా తెరకెక్కుతున్న `వాల్మీకి` చిత్రంలో నటిస్తున్నాడు. ఆదివారం విడుదలైన ఈ సినిమా టైటిల్ లోగో ఇంప్రెసివ్‌గా ఉండడంతో... ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమాలో... ఒరిజినల్ వెర్షన్ లో విలన్ గా నటించిన బాబీ సింహా పాత్రలో కనిపించనున్నాడు వరుణ్. ఇదిలా ఉంటే... ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలను అందిస్తున్నాడు. `ఎఫ్ 2` తరువాత వరుణ్…

`రన్ రాజా రన్`, `సాహో` తరువాత కూడా...
శర్వానంద్ కథానాయకుడిగా నటించిన `రన్ రాజా రన్` (2014) చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు సుజీత్. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా... బాక్సాఫీస్ వద్ద హిట్ ఫిల్మ్‌గా నిలచింది. ఆ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో తన సెకండ్ ఫిల్మ్ చేయడానికి ఫిక్స్ అయిపోయిన ఈ యంగ్ డైరెక్టర్... భారీ విరామమే తీసుకుని మరీ ప్రస్తుతం `సాహో` చేస్తున్నాడు. ప్రభాస్ హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ త్రిభాషా చిత్రం... ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో.. సుజీత్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం…

వరుణ్ తేజ్‌కిదే మొదటిసారి
`ఫిదా`, `తొలిప్రేమ` తరువాత `ఎఫ్ 2` రూపంలో మరో ఘనవిజయాన్ని అందుకున్నాడు యువ కథానాయకుడు వరుణ్ తేజ్. ప్రస్తుతం ఈ మెగా ప్రిన్స్ రెండు చిత్రాలను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. అందులో ఒకటి... `జిగర్తండా` రీమేక్ కాగా... మరొకటి నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందించనున్న స్పోర్ట్స్ డ్రామా. `జిగర్తండా` రీమేక్ విషయానికి వస్తే... ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. రేపు(ఆదివారం) లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే... కెరీర్‌లో ఇప్పటివరకు ఎనిమిది చిత్రాలను పూర్తి చేసిన వరుణ్... మొదటిసారిగా నటిస్తున్న…

దర్శకుడిగా మారుతున్న మాధవన్
అలై పాయుదే మూవీ ద్వారా కోలీవుడ్ కు పరిచయమైన మాధవన్, రెహనా హై తేరే దిల్ మే మూవీ తో బాలీవుడ్ కు ఎంటరయ్యారు. హీరో మాధవన్ నటించిన అనేక తమిళ, హిందీ సినిమాలు ఘన విజయం సాధించాయి. తెలుగు లో నాగచైతన్య హీరో గా నటించిన సవ్యసాచి మూవీ లో కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు హీరో మాధవన్ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్ మూవీ తో దర్శకుడిగా మారుతున్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ - ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి ఒకే ఫ్రేమ్ లో
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోకి రెండవ భార్యగా లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే వర్మ చెప్పారు. ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించి రోజుకో అప్ డేట్ ఇస్తూ క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్స్, పాటలతో సంచలనం సృష్టిస్తున్న వర్మ..తాజాగా మరో అప్ డేట్ తో మన ముందుకు వచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి ఉన్న ఓ ఫొటోను ఈరోజు ఫేస్ బుక్ లో విడుదల చేశారు. ఇప్పుడు ఈ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న Mr. మజ్ను
తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన సినిమా Mr. మజ్ను. ఈ సినిమా ఈ నెల 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయింది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఎస్వీసీసీ (శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్) అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

చిరు-కొరటాల మూవీ రూమర్లు నమ్మొద్దు
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ లో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఇక ఈసినిమా తరువాత చిరంజీవి స్టార్ డైరెక్టర్ శివ కొరటాల దర్శకత్వంలో చేయనున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆతరువాత త్రివిక్రమ్ పేరు తెరపైకి రావడంతో కొరటాల శివతో సినిమా ఉండటంలేదని, అది ఇంకా ఆలస్యం కానుందని రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు ఈ రూమర్లపై ఓ క్లారిటీ వచ్చింది.

మహర్షి చివరి షెడ్యూల్ అప్ డేట్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా పొల్లాచ్చిలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుటుండగా... ఈ వారం చివరితో అక్కడి షెడ్యూల్ పూర్తువుతుంది. దాని తరువాత ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు చిత్రబృందం.