ఈ ఏడాది అంతా వరుస సినిమాలతో సందడి చేయబోతోంది ఉత్తరాది సోయగం రకుల్ ప్రీత్ సింగ్. ఈ సంక్రాంతికి విడుదలైన `యన్.టి.ఆర్. కథానాయకుడు`లో అతిలోక సుందరి శ్రీదేవిగా అతిథి పాత్రలో దర్శనమిచ్చిన రకుల్… ఫిబ్రవరిలో `దేవ్`తో పలకరించనుంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్ డే స్పెషల్‌గా రానున్న `దేవ్`… ఓ ట్రావెల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. `ఖాకి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత కార్తితో జోడీకట్టిన ఈ సినిమాలోనూ… రకుల్ నటనకు అవకాశమున్న పాత్రలో కనిపించనుందట. అంతేకాదు… ఈ సినిమాలో మేఘన అనే మధ్యతరగతి అమ్మాయి పాత్రలో రకుల్ దర్శనమివ్వనుందని సమాచారం. కొత్త తరహా కథ, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమాలో… కార్తి, రకుల్ మధ్య వచ్చే పరిచయ సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని టాక్. రజత్ రవిశంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. హారిస్ జైరాజ్ సంగీతమందిస్తున్నాడు. మరి… `ఖాకి`లాగే ఈ చిత్రం కూడా కార్తి, రకుల్ జోడీకి మరో విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=LMYFouzOOjo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: