అలై పాయుదే మూవీ ద్వారా కోలీవుడ్ కు పరిచయమైన మాధవన్, రెహనా హై తేరే దిల్ మే మూవీ తో బాలీవుడ్ కు ఎంటరయ్యారు. హీరో మాధవన్ నటించిన అనేక తమిళ, హిందీ సినిమాలు ఘన విజయం సాధించాయి. తెలుగు లో నాగచైతన్య హీరో గా నటించిన సవ్యసాచి మూవీ లో కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు హీరో మాధవన్ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్ మూవీ తో దర్శకుడిగా మారుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నంబి నారాయణన్ ఏరో స్పేస్ ఇంజనీర్, భారతీయ శాస్త్రవేత్త. నంబి నారాయణన్ &టీమ్ రూపొందించిన వికాస్ ఇంజన్ ను పలు ఇస్రో రాకెట్స్ లో ఉపయోగించారు. చంద్రయాన్ -1 మిషన్ లో PSLV, GSLV రాకెట్స్ లో కూడా వికాస్ ఇంజన్ ఉపయోగించారు. అత్యంత ప్రతిభాశాలి,దేశానికి సేవలు అందించిన నంబి నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా రాకెట్రీ – ది నంబి ఎఫెక్ట్ మూవీ తమిళ, హిందీ, ఇంగ్లీష్
భాషలలో రూపొందుతుంది. రాకెట్రీ – ది నంబి ఎఫెక్ట్ మూవీ లో మాధవన్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు.
[youtube_video videoid=WunwSv34a8s]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: