రాజకీయనాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో .. మహి వి రాఘవ్ దర్శకత్వంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. వైఎస్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా… ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన సాయంత్రం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను ఫిక్స్ చేశారు. అంతేకాదు యూఏస్ లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేశారు. యూఎస్ లో తొమ్మిది సిటీస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్ హాజరవుతారన్న వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే అధికారింగా ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగా 70ఎమ్ ఎమ్ బ్యానర్ పై శివ మేక సమర్పణ లో విజయ్ చిల్ల, శశిదేవ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, రావు రమేష్, పోసాని, సుహాసిని, అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కె సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సమర శంఖం, రాజన్న నిన్నాపగలరా సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో మూవీ పై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూద్దాం.
[youtube_video videoid=OuIJDxLeEBc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: