షూటింగ్ పూర్తి – మంచి లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్

Rakul Preet About NGK Movie Experience,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Suriya NGK Movie Latest News,NGK Movie Shooting Updates,#NGK,Actress Rakul Preet About NGK Movie,Rakul Preet Wraps Up The Shoot For NGK,Suriya NGK Movie Shooting News
Rakul Preet About NGK Movie Experience

7 /జి బృందావన్ కాలనీ ఫేమ్ సెల్వరాఘవన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఎన్ జి కె’. తమిళ సూపర్ స్టార్ హీరో సూర్య , రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి హీరోయిన్లుగా తమిళ్ తో పాటు తెలుగులోనూ ఏకకాలంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా తాజా అప్ డేట్ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమాలో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని రకుల్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తూ తెలిపింది. సెల్వరాఘవన్, సూర్య సర్ తో పనిచేయడం ఓ మంచి లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ అంటూ.. తన షూటింగ్ పార్ట్ పూర్తయిందంటూ ట్వీట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 


ఇక ఈ సినిమా టీజర్ రీలిజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

కాగా డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకం ఫై ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ్ పాటు తెలుగులోనూ ఏప్రిల్14న విడుదలకానున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ నటుడు జగపతిబాబు కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. య‌వ‌న్ శంక‌ర్ రాజా సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ఇక ఈ మూవీలో సూర్య పవర్ ఫుల్ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. మరి ఈ సినిమా ఎంత వరకూ రకుల్ కు విజయం సాధించిపెడుతుందో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=u9AvJVIsPfA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.