శర్వానంద్ కథానాయకుడిగా నటించిన `రన్ రాజా రన్` (2014) చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు సుజీత్. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా… బాక్సాఫీస్ వద్ద హిట్ ఫిల్మ్‌గా నిలచింది. ఆ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో తన సెకండ్ ఫిల్మ్ చేయడానికి ఫిక్స్ అయిపోయిన ఈ యంగ్ డైరెక్టర్… భారీ విరామమే తీసుకుని మరీ ప్రస్తుతం `సాహో` చేస్తున్నాడు. ప్రభాస్ హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ త్రిభాషా చిత్రం… ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో.. సుజీత్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సుజీత్ తదుపరి చిత్రం కూడా `రన్ రాజా రన్`, `సాహో` చిత్రాల నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌లోనే ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు… ఈ సినిమాలో ఓ అగ్ర కథానాయకుడు నటించే అవకాశం ఉందని టాక్. కొన్నాళ్ళ క్రితం… అల్లు అర్జున్ హీరోగా సుజీత్ నెక్ట్స్ ఫిల్మ్ ఉంటుందనే కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏదేమైనా… త్వరలోనే సుజీత్ మూడో చిత్రంపై ఫుల్ క్లారిటీ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=nfp9ookUSWE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: