డైరెక్టర్ క్రిష్ అనగానే మన కళ్ళ ముందు గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం,కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి సెన్సిబుల్ సెన్సేషన్స్ కదలాడుతాయి. దర్శకుడిగా తన చిత్రాల ద్వారానే కాకుండా వ్యక్తిగా తన ప్రవర్తన ద్వారా కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును సంపాదించుకున్నారు క్రిష్. వివాదాలు, పరుషపదజాలం వంటి హార్ష్ బిహేవియర్ క్రిష్ లో మనకు మచ్చుకైనా కనిపించదు.అలా అందరితో సౌమ్యుడు, సహృదయుడు అని అభినందనలు అందుకునే క్రిష్ కు కూడా కోపం వచ్చింది అంటే అది నిజంగా సంచలనమే అనుకోవాలి. అందులోనూ ఆడవాళ్లను గౌరవిస్తూ , స్త్రీ పాత్రలను సమున్నతంగా ఆవిష్కరించే క్రిష్ కోపానికి, ఆవేదనకు ఒక స్త్రీ కారణం కావడం ఇంకా బాధాకరం. ఇంతకూ అసలు విషయంలోకి వెళ్తే క్రిష్ దర్శకత్వంలో రూపొందిన” మణికర్ణిక” చిత్రానికి దర్శకురాలిగా తన పేరు వేసుకోవడమే కాకుండా , ఆ సినిమాను తన ఇష్టం వచ్చిన రీతిలో కంగాళీగా తయారు చేసి పెట్టింది అందులో టైటిల్ పాత్ర పోషించిన కంగనా రనౌత్. ఒక సినిమాలో హీరోయిన్ గా చేసిన నటి ఆ చిత్ర దర్శకుడినే ధిక్కరిస్తూ దర్శకురాలుగా తన పేరు వేసుకోవడం ఇంతవరకు సినిమా చరిత్రలో జరగలేదు. నిర్మాత నిస్సహాయతను అడ్డం పెట్టుకుని కంగనా రనౌత్ ఇంత దౌర్జన్యంగా వ్యవహరించటాన్ని చూసి బాలీవుడ్ తో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆశ్చర్యపోతుంది.ఈ వివాదంపై ఇంతకాలం సహనాన్ని ప్రదర్శించిన క్రిష్ ఈరోజు తన కోపాన్ని, ఆవేదనను వ్యక్తం చేస్తూ జరిగిన వాస్తవాలు వెల్లడించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
* నేను మణికర్ణిక సినిమాను మధ్యలో వదిలేసి వచ్చాను అని నింద మోపడమే కాకుండా దాన్ని సాకుగా చూపించి కంగనా రనౌత్ దర్శకురాలిగా తన పేరు వేసుకుంది. వాస్తవానికి నేను ఈ సినిమాకు 109 రోజులు పని చేశాను. చివరలో మిగిలిన కొద్దిపాటి ప్యాచ్ వర్క్ నేను పూర్తి చేస్తాను అని స్నేహ పూర్వకంగా చెప్తే నమ్మి వచ్చాను. ఇక్కడ ఎన్టీఆర్ బయోపిక్ చేయవలసి రావటంతో ఒక మంచి అండర్స్టాండింగ్ తో చేస్తున్నాము అనుకున్నానే తప్ప కంగనా రనౌత్ ఇలా చేస్తుందని ఊహించలేదు.
* ఇలా ఎందుకు చేశావు అని అడిగితే ఆమె చెబుతున్న కారణాలు కేవలం కుంటి సాకులుగా మాత్రమే అనిపిస్తున్నాయి. సోనూసూద్ తో ఆమెకు వచ్చిన విభేదాల విషయంలో నేను ఆమెకు సపోర్ట్ చేయని కారణంగా ఇలా చేశాను అంటుంది. అలాగే కెమెరామెన్ జ్ఞాన శేఖర్ వర్క్ ఆమెకు నచ్చలేదట. నిజానికి ఈ సినిమాలో ప్రతి నటుడు, ప్రతి టెక్నీషియన్ ప్రాణం పెట్టి పని చేశారు.
* కంగనా రనౌత్ ఇమేజ్ ని నమ్మి నేను ఈ సినిమా చెయ్యలేదు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్రను గొప్పగా ఆవిష్కరించాలనే లక్ష్యంతో ఈ సినిమా చేశాను. అంత గొప్ప లక్ష్యంతో నేను బంగారం లాంటి సినిమా చేసి పెట్టి వస్తే దానిని సత్తు రేకు లాగా చేసి పడేసింది కంగనా. మొదట రిలీజ్ చేసిన పోస్టర్ లో ముందు నా పేరు “డైరెక్టర్ క్రిష్” అని వేసి తరువాత రిలీజ్ చేసిన పోస్టర్స్ లో ఆమె పేరు కింద నా పేరును” రాధాకృష్ణ జాగర్లమూడి” అని వేయించిది. నేను ఎన్టీఆర్ బయోపిక్ బిజీ లో ఉండటాన్ని అలుసుగా, అవకాశంగా తీసుకుని ఆమె ఇలా చేయటం నాకు చాలా కోపాన్ని తెప్పించింది. సినిమా ఫస్ట్ కట్ చూసినప్పుడు సినిమా ఎలా ఉందో చెప్పకుండా “ సోనూసూద్ క్యారెక్టర్ చాలా డామినేటింగ్ గా ఉంది కదా” అన్నదే ఆమె తొలి స్పందన. ఆ క్యారెక్టర్ ను కిల్ చేస్తే తప్ప తన క్యారెక్టర్ ఎలివేట్ కాదు అన్న దురాలోచన ఆమెలో బాగా పడిపోయింది. కాబట్టి ఎడిటింగ్ లో ఇష్టం వచ్చిన రీతిలో సినిమాను ఎడిట్ చేసింది. ఆమె అంత చేసినా finally it is my baby అన్న నిజాన్ని ఎవరూ కాదనలేరు…. అంటూ ఘాటుగా స్పందించారు క్రిష్.
వివాదాలకు, మనస్పర్ధలకు, అనాహ్లాద పరిస్థితులకు దూరంగా ఉండే క్రిష్ ఇంత ఆవేదన వ్యక్తం చేశారు అంటే కంగనా రనౌత్ ఆ సెన్సిటివ్ మేకర్ ను ఎంతగా హ్యూమిలియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.
మరి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు జరగని ఇలాంటి దౌర్జన్యం పై క్రిష్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూద్దాం.
[youtube_video videoid=bWmzvwaM-es]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: