లక్ష్మీస్ ఎన్టీఆర్ – ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి ఒకే ఫ్రేమ్ లో

Lakshmi’s NTR Movie Latest Poster Talk, Lakshmi’s NTR Movie New Poster Talk, Lakshmi’s NTR Movie New Updates, Latest Telugu Movies News, RGV Lakshmi’s NTR Movie News, RGV Revealed Lakshmi’s NTR New Poster, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Lakshmi’s NTR Movie Latest Poster Talk

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోకి రెండవ భార్యగా లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే వర్మ చెప్పారు. ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించి రోజుకో అప్ డేట్ ఇస్తూ క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్స్, పాటలతో సంచలనం సృష్టిస్తున్న వర్మ..తాజాగా మరో అప్ డేట్ తో మన ముందుకు వచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి ఉన్న ఓ ఫొటోను ఈరోజు ఫేస్ బుక్ లో విడుదల చేశారు. ఇప్పుడు ఈ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞ శెట్టి నటిస్తుండగా.. కీలకమైన చంద్రబాబు నాయుడు పాత్రలో వంగవీటి ఫేం శ్రీతేజ్‌ కనిపించనున్నాడు. ఇక ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ నటిస్తున్నాడు. మిగిలిన పాత్రల్లో ఏ నటీ నటులు నటిస్తున్నారో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు వర్మ. ఇక ఈ సినిమాకు కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. మరి ముందు ముందు వర్మ ఇంకెన్ని షాకులిస్తాడో చూడాలి..

[subscribe]

[youtube_video videoid=zNulrFJpDl4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.