వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి. నాలుగేళ్ళ క్రితం విడుదలైన `పటాస్` చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేసిన అనిల్… ఆ తరువాత `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్` చిత్రాలతోనూ మెప్పించాడు. ఇక తాజాగా విడుదలైన `ఎఫ్ 2` ఈ ఏడాది తొలి బ్లాక్‌బస్టర్‌గా నిలచింది. అంతేకాదు… వంద కోట్ల గ్రాస్ క్లబ్‌లోనూ చేరిపోయింది… మీడియం బడ్జెట్ సినిమాల పరంగా కొత్త రికార్డుని సృష్టించింది. ఇదిలా ఉంటే… తన తొలి నాలుగు చిత్రాలతో అనిల్ ఓ కొత్త రికార్డు సొంతం చేసుకున్నాడు. అదేమిటంటే… తన ప్రతి చిత్ర కథానాయకుడికి కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్‌ని అందించాడు అనిల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… అనిల్ తొలి చిత్రం `పటాస్` కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలవగా… రెండో చిత్రం `సుప్రీమ్` సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలచింది. అలాగే… `రాజా ది గ్రేట్` విషయానికి వస్తే… సదరు సినిమా రవితేజ కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలచింది. ఇక తాజా చిత్రం `ఎఫ్ 2` సీనియర్ హీరో వెంకటేష్, యువ కథానాయకుడు వరుణ్ తేజ్ కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా దూసుకుపోతోంది. మొత్తమ్మీద… అనిల్ తన చిత్ర కథానాయకులకు వరుసగా హయ్యస్ట్ గ్రాసర్స్ అందిస్తూ… `హయ్యస్ట్ గ్రాసర్ స్పెషలిస్ట్` అయిపోతున్నాడు. మరి… తదుపరి చిత్రంతోనూ ఈ ఫీట్‌ని అనిల్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.
[youtube_video videoid=2F4DHcfKDHY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: