`ఫిదా`, `తొలిప్రేమ` తరువాత `ఎఫ్ 2` రూపంలో మరో ఘనవిజయాన్ని అందుకున్నాడు యువ కథానాయకుడు వరుణ్ తేజ్. ప్రస్తుతం ఈ మెగా ప్రిన్స్ రెండు చిత్రాలను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. అందులో ఒకటి… `జిగర్తండా` రీమేక్ కాగా… మరొకటి నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందించనున్న స్పోర్ట్స్ డ్రామా. `జిగర్తండా` రీమేక్ విషయానికి వస్తే… ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. రేపు(ఆదివారం) లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే… కెరీర్‌లో ఇప్పటివరకు ఎనిమిది చిత్రాలను పూర్తి చేసిన వరుణ్… మొదటిసారిగా నటిస్తున్న రీమేక్ ఇదే కావడం విశేషం. హీరోగా నటించిన తొలి చిత్రం `ముకుంద`తో మొదలుకుని `కంచె`, `లోఫర్`, `మిస్టర్`, `ఫిదా`, `తొలిప్రేమ`, `అంతరిక్షం`, `ఎఫ్ 2`వరకు వరుణ్ నటించిన అన్ని సినిమాలూ స్ట్రయిట్ ఫిల్మ్స్‌నే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో… వరుణ్ ఫస్ట్ టైమ్ చేస్తున్న రీమేక్ అతనికి మంచి విజయాన్ని అందించాలని కోరుకుందాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=t-SWlHFaFUk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: