కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 17

సినిమా వార్తలు

తలైవి మూవీ లో సీనియర్ ఎన్టీఆర్ గా జూనియర్ ఎన్టీఆర్ ?

విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మాణ సారథ్యం లో లెజండరీ యాక్ట్రెస్, తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న తలైవి మూవీ షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్, లెజండరీ యాక్టర్, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎమ్ జి రామచంద్రన్ పాత్రలో ట్యాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి నటిస్తున్నారు. ఇతర పాత్రలలో ప్రముఖ నటీనటులు నటించనున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కె.జి.యఫ్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా..?

సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు 'జాన్' సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. యూరోప్ లో 20 రోజుల షూటింగ్ మాత్రమే జరిగింది. దాని తర్వాత సాహో పనుల్లో ప్రభాస్ ఫుల్ బిజీగా మారిపోవడంతో ఆరు నెలలకు పైగా బ్రేక్ పడింది. ఇప్పుడు సాహో హడావుడి కూడా అయిపోయింది. దీనితో మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. విరామం తర్వాత మళ్లీ షూటింగ్ ప్రారంభించనున్నారు. తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలుకానుంది. ప్రభాస్ తో పాటు ముఖ్య తారాగణమంతా ఈ షెడ్యూల్ లో పాలుపంచుకుంటారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నిన్ను చూస్తే గర్వం గా ఉంది సితు పాపా - మహేష్ బాబు

క్రిస్ బక్ , జెన్నిఫర్ లీ దర్శకత్వంలో ఎల్సా, అన్నా ప్రధాన పాత్రలలో వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ నిర్మించిన 3డి కంప్యూటర్ యానిమేటెడ్ ఫాంటసీ మూవీ ఫ్రోజన్ 2013 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇప్పడు ఆ మూవీ కి సీక్వెల్ ఫ్రోజన్2మూవీ రూపొంది ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 22 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లోని రాకుమారి ఎల్సా పాత్రకు హిందీ లో ప్రియాంక చోప్రా, తెలుగు లో నిత్యా మీనన్, తమిళం లో శృతి హాసన్ డబ్బింగ్ చెప్పడం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వెజిటేరియన్ గా మారిన స్టార్ హీరోయిన్ నయనతార

వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై ఆర్ జే బాలాజీ, శరవణన్ సంయుక్త దర్శకత్వంలో లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్ర లో తమిళ మూవీ మూకుత్తి అమ్మన్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నయనతార దేవత పాత్రలో నటిస్తున్నారు. సెటైరికల్ కామెడీ మూకుత్తి అమ్మన్ మూవీ కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఆర్ జే బాలాజీ అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ , రజనీకాంత్ , వెంకటేష్ లకు "గ్రీన్ ఛాలెంజ్ "

మూడు మొక్కలు నాటే "గ్రీన్ ఛాలెంజ్ " ను రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్ అన్ని రంగాలవారినీ ఆకర్షిస్తోంది. తాజా గా సూపర్ స్టార్ కృష్ణ గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించారు. తన ఇంటి ప్రాంగణం లో సూపర్ స్టార్ కృష్ణ మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సంతోష్ కుమార్ తో పాటు కాదంబరి కిరణ్ పాల్గొన్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దంప‌తుల పాత్ర‌ల్లో బ‌న్నీ, ర‌ష్మిక‌?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ని తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో బ‌న్నీ స్మ‌గ్లింగ్ చేసే లారీ డ్రైవ‌ర్ గా క‌నిపించ‌నున్నాడ‌ని టాక్. కాగా... ఈ సినిమాలో బ‌న్నీకి జోడీగా క‌న్న‌డ క‌స్తూరి ర‌ష్మికా మంద‌న్న‌ న‌టించ‌నున్న విష‌యం విదిత‌మే.

Team TFNవాట్సాప్
'జాక్‌పాట్' ట్రైలర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

'జాక్‌పాట్' ట్రైలర్ రిలీజ్

జ్యోతిక ప్రధాన పాత్రలో 'జాక్ పాట్' ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. వివాహం తర్వాత నటనకు కొన్నేళ్ళు గ్యాప్‌ తీసుకున్న జ్యోతిక ఇప్పుడు మళ్లీ 'జాక్‌పాట్‌' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. కల్యాణ్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 21వ తేదీన రిలీజ్ కానుంది. ఇక డేట్ రీలిజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఇక ఇప్పటీకే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'మిస్ మ్యాచ్' ట్రైలర్ రిలీజ్

నిర్మల్ కుమార్ దర్శకత్వంలో ఆట గదరా శివ ఫేమ్ ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న సినిమా 'మిస్ మ్యాచ్'. ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేరేసారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వెంక‌టేష్‌కి జోడీగా అనుష్క‌?

త‌మిళ‌నాట ఘ‌న‌విజ‌యం సాధించిన `అసుర‌న్`... తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ని ప్ర‌ముఖ నిర్మాత‌లు డి.సురేష్ బాబు, క‌లైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. శ్రీ‌కాంత్ అడ్డాల ఈ రీమేక్‌ని డైరెక్ట్ చేస్తాడ‌ని ప్రచారం సాగుతోంది. కాగా... ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో వెంకీకి జోడీగా అనుష్క న‌టించే అవ‌కాశ‌ముంద‌ని టాక్. వాస్త‌వానికి, ఈ పాత్ర కోసం ఇదివ‌ర‌కు శ్రియ పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. అయితే, అనుష్క ఆ పాత్ర‌లో న‌టిస్తుంద‌ని స‌మాచారం. అభిన‌యానికి అవ‌కాశ‌మున్న డీ-గ్లామ‌ర్ రోల్ కావ‌డంతో స్వీటీ కూడా ఆస‌క్తి చూపిస్తుంద‌ని…

Team TFNవాట్సాప్
సాంగ్

బాల‌కృష్ణ‌, బోయ‌పాటి చిత్రానికి ముహూర్తం ఫిక్స్‌?

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం త‌న 105వ చిత్రం `రూల‌ర్`ని పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. డిసెంబ‌ర్ 20న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఈ లోపే బాల‌య్య త‌న నెక్ట్స్ వెంచ‌ర్ ని ప్రారంభించ‌బోతున్నార‌ని టాక్‌. త‌న‌కు అచ్చొచ్చిన ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో చేయ‌బోతున్న ఈ సినిమాని డిసెంబ‌ర్ 9న పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభిస్తార‌ని స‌మాచారం. అయితే, రెగ్యుల‌ర్ షూటింగ్ ని మాత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో మొద‌లుపెట్టే అవ‌కాశ‌ముంద‌ని వినికిడి. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మించ‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో బాల‌య్య రెండు విభిన్న ఛాయలున్న…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`దిల్` రాజు సంస్థ‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌?

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబినేష‌న్ లో ఓ చిత్రం రాబోతున్న సంగ‌తి తెలిసిందే. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లో ఉంది. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే... ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాత `దిల్‌` రాజు నిర్మిస్తార‌ని తెలిసింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ చిత్రాన్ని నిర్మించాల‌ని `దిల్‌` రాజు చాన్నాళ్ళుగా భావిస్తున్నారట‌. శివ నిర్వాణ కాంబినేష‌న్ మూవీతో అది కార్య‌రూపం దాల్చ‌నుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముందంటున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరుతో మ‌రోసారి మ‌ణిశ‌ర్మ‌?

మెగాస్టార్ చిరంజీవికి అచ్చొచ్చిన స్వ‌ర‌క‌ర్త‌లో మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఒక‌రు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ప‌లు చిత్రాలు ఘ‌న‌విజ‌యం సాధించాయి. `బావ‌గారూ బాగున్నారా?`, `చూడాల‌ని వుంది`(1998), ఇద్ద‌రు మిత్రులు (1999), అన్న‌య్య (2000), మృగ‌రాజు (2001), ఇంద్ర (2002), ఠాగూర్ (2003), అంజి (2004), జై చిరంజీవ‌! (2005), స్టాలిన్ (2006)... ఇలా వ‌రుస‌గా తొమ్మిదేళ్ళ పాటు ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో ప‌లు మ్యూజిక‌ల్ హిట్స్ వచ్చాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

శంకర్ సినిమాకు విజయ్ సేతుపతి నో..!

శంకర్ సినిమా అంటే ఎన్ని అంచనాలు వుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక శంకర్ సినిమాలో నటించడానికి హీరో హీరోయిన్స్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శంకర్ సినిమాలో ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. కానీ ఒక హీరో మాత్రం శంకర్ సినిమాకు నో చెప్పాడంట. అతను ఎవరో కాదు తమిళ ప్రేక్షకులతో మక్కల్ సెల్వన్‌గా పిలుపించుకున్న నటుడు విజయ్ సేతుపతి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ముందే వచ్చేస్తున్న 'దర్బార్'..!

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెపెట్టేసింది. ఇక తాజాగా రజనీ తన పాత్రకి డబ్బింగ్ కూడా పూర్తి చేసారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేద్దామని చూస్తున్న సంగతి కూడా విదితమే. అయితే ఇక్కడే ఒక సమస్యవచ్చింది. ఇదే పొంగల్ పోరులో మన తెలుగు సినిమాలు పోటీకి సిద్ధంగా వున్నాయి. ‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 12న ఈ రెండూ విడుదలకానున్నాయి.

TFN Adminవాట్సాప్
Kamma Rajyam Lo Kadapa Reddlu Second Trailer Release,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Kamma Rajyam Lo Kadapa Reddlu Movie Updates,Kamma Rajyam Lo Kadapa Reddlu Telugu Movie Latest News,Kamma Ra
ట్రైలర్ & టీజర్

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' రెండో ట్రైలర్ రిలీజ్

సంచలన దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ మరొక వివాదస్పద సినిమా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' తో అభిమానుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్‌మెంట్‌ దగ్గర నుంచే వివాదాస్పదమైంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు విడుదల చేసి ఆసక్తిని రేపుతున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' నుండి బిగ్ అప్ డేట్ - రూమర్లకు చెక్ పెడతాం..!

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. రామోజీ ఫిలింసిటీలో ప్ర‌త్యేకంగా నిర్మించిన సెట్ల‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది.ఈ షెడ్యూల్ లో రామ్ చ‌ర‌ణ్ పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

మే డే రోజు వస్తున్న తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్'

మారుతి దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా 'ప్రతిరోజు పండగే' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా వుంది. కాగా ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా...అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'సరిలేరు నీకెవ్వరు' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మొత్తానికి మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అప్ డేట్ రానే వచ్చింది. ఇన్ని రోజులు కేవలం పోస్టర్ లను రిలీజ్ చేస్తుండగా ఈ సినిమా టీజర్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు కాస్త ఊరటనిచ్చేవిధంగా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. నవంబర్ 22వ తేదీన ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా తమ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

TFN Adminవాట్సాప్
Arjun Suravaram Trailer Out Now,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Arjun Suravaram Trailer,Arjun Suravaram Movie Trailer,Arjun Suravaram Telugu Movie Trailer,Arjun Suravaram Movie Updates
ట్రైలర్ & టీజర్

'అర్జున్ సురవరం' ట్రైలర్ రిలీజ్

ఫైనల్లీ 'అర్జున్ సురవరం' సినిమాకు మంచి రోజులు వచ్చాయి. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని అన్ని కార్యక్రమాలకు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మాత్రం రిలీజ్ కష్టాలు మాములుగా రాలేదు. పలుమార్లు రిలీజ్ డేట్ వాయిదా పడటంతో అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనుకున్నారు అంతా.. ఎట్టకేలకు ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. నవంబర్ 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

విజయ్ కు కూడా అదే హీరోయిన్ అంటున్న పూరీ..!

నేను ఒక్కసారి కమిట్ అయితే ఎవ్వరి మాట వినను అని పూరీ జగన్నాథ్ పోకిరి సినిమాలో మహేష్ చెప్పించాడు. నిజానికి అవి చెప్పింది మహేష్ అయినా కూడా పూరీ వ్యక్తిత్వం కూడా అలానే ఉంటుందని మనకు తెలిసిందే. ఇక తన సినిమాల్లో కూడా కొన్ని కామన్ పాయింట్స్ ను చూస్తుంటాం. ఇదిలావుంచితే తనకు కలిసొచ్చిన హీరోయిన్ ను కూడా పూరీ రిపీట్ చేస్తూనే ఉంటాడు. రక్షిత, ఇలియానా, కాజల్ వీరందరితో ఒకటికి పైగా సినిమాలు చేసాడు. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో భామ కూడా చేరనుంది. ఆమె ఎవరో కాదు ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్.

TFN Adminవాట్సాప్

షేర్