ముందే వచ్చేస్తున్న ‘దర్బార్’..!

Rajinikanth Darbar Movie Set To Release In Advance,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Darbar Movie Updates,Darbar Telugu Movie Latest News,Darbar Movie Release Date,Darbar Telugu Movie Release Date Confirmed,Darbar Movie New Release Date

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెపెట్టేసింది. ఇక తాజాగా రజనీ తన పాత్రకి డబ్బింగ్ కూడా పూర్తి చేసారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేద్దామని చూస్తున్న సంగతి కూడా విదితమే. అయితే ఇక్కడే ఒక సమస్యవచ్చింది. ఇదే పొంగల్ పోరులో మన తెలుగు సినిమాలు పోటీకి సిద్ధంగా వున్నాయి. ‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 12న ఈ రెండూ విడుదలకానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో ముందుగా జనవరి 10న విడుదలచేస్తే బాగుంటుందని అనుకున్నారు. కానీ దాన్ని కూడా ఇంకాస్త ముందుకు జరిపి జనవరి 9న విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. సో అనుకున్నదానికంటే దర్బార్ సినిమా ముందే వస్తుందన్నమాట.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌తో పాటు చెన్నై భామ నివేదా థామ‌స్ , మ‌ల‌యాళ న‌టుడు చెంబన్ వినోద్ జోస్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. దర్బార్ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను దిల్ రాజు, NV ప్రసాద్, UV వంశీ తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =