ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 16
బ్రహ్మాస్త్ర మూవీలో ఆర్కియాలజిస్ట్ గా నాగార్జున
నవంబర్ 21, 22, 23... టీజర్స్ స్పెషల్
'తాళి' రీమేక్ లో ఆనంద్ దేవరకొండ..!

90ఎంఎల్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్
టిక్ టాక్ కలల రాణి
మెలోడీ బ్రహ్మ ఖాతాలో 'అసురన్' రీమేక్?
నాగచైతన్యకి విలన్ గా అజయ్ భూపతి?
బాలయ్యతో మరోసారి వేదిక?

10 భాషల్లో రిలీజ్ కానున్న'RRR'
'భాగ్య నగర వీధుల్లో గమ్మత్తు' ట్రైలర్ రిలీజ్
లక్ష్ 'వలయం' డబ్బింగ్ ప్రారంభం
'ఆర్ఆర్ఆర్' ఎన్టీఆర్ హీరోయిన్, విలన్ ఫిక్స్
కింగ్ నాగార్జున రిలీజ్ చేసిన తూటా మూవీ ట్రైలర్
'శివ నిర్వాణ' తర్వాతే 'హీరో' అంటున్న విజయ్..!
జార్జి రెడ్డి మూవీ సెన్సార్ పూర్తి

'90ML' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు
గూగుల్ ఇండియా ట్రెండింగ్ లో ఒలీవియా మోరిస్ నేమ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా మల్టీ స్టారర్ #RRR మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు మూవీ షూటింగ్ 70%కంప్లీట్ అయినట్టు సమాచారం. రామ్ చరణ్ జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ కు జంటగా నటించే హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ పేరును రాజమౌళి నిన్న వెల్లడించారు.
బ్రహ్మాస్త్ర మూవీలో ఆర్కియాలజిస్ట్ గా నాగార్జున
ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, అలియా భట్ జంటగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో ఫాంటసీ, యాక్షన్ అడ్వెంచర్ హిందీ మూవీ బ్రహ్మాస్త్ర రూపొందుతున్న విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. స్టార్ హీరో షారూఖ్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు.

'నిశ్శబ్దం' హాలీవుడ్ స్టార్ ఫస్ట్ లుక్ రిలీజ్
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో 'నిశ్శబ్దం' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
నవంబర్ 21, 22, 23... టీజర్స్ స్పెషల్
ప్రతిష్ఠాత్మక చిత్రాల టీజర్స్ వరుసగా మూడు రోజుల పాటు సందడి చేయడం అరుదుగా జరుగుతుంటుంది. నవంబర్ 21, 22, 23 తేదీల్లో ఇలాంటి వాతావరణమే నెలకొంటోంది. ఈ మూడు రోజులు కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ టీజర్స్ హవా ఉండనుంది.
`సరిలేరు నీకెవ్వరు`కి అనిల్ రావిపూడి సెంటిమెంట్
వరుస విజయాలతో ముందుకు సాగుతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ ఏడాది సంక్రాంతికి `ఎఫ్ 2`తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్... వచ్చే సంవత్సరం ముగ్గుల పండక్కి `సరిలేరు నీకెవ్వరు`తో పలకరించబోతున్నాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే... `ఎఫ్ 2` ఏ తేదిన (జనవరి 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిందో... సరిగ్గా అదే రోజున `సరిలేరు నీకెవ్వరు` కూడా రాబోతోంది. పైగా... రెండు చిత్రాల్లోనూ `దిల్` రాజు బ్రాండ్ ఉండడం... దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు కావడం.... వంటి అంశాలు `సరిలేరు నీకెవ్వరు`పై మరింత పాజిటివ్ సెంటిమెంట్ ని పెంచుతున్నాయి.
'తాళి' రీమేక్ లో ఆనంద్ దేవరకొండ..!
దాదాపు పాతికేళ్ల క్రితం ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘తాళి’ సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాను కూడా రీమేక్ చేయాలనీ చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ ఈ సినిమాను రీమేక్ చేసే హీరో ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు.. పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన దొరసాని సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆనంద్ దేవరకొండ.

90ఎంఎల్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్
సరస్వతి శుక్లా సమర్పణలో కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై క్రేజీ హీరో కార్తికేయ, నేహా సోలంకి జంటగా శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 90ఎంఎల్ మూవీ డిసెంబర్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కార్తికేయ మోడరన్ దేవదాసు గా నటించిన ఈ మూవీ లో అలీ, పోసాని, రావు రమేష్, రవికిషన్ ముఖ్య పాత్రలలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
టిక్ టాక్ కలల రాణి
హీరో సాయి తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యం లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రతి రోజూ పండగే మూవీ డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానుంది. ఒక సరికొత్త పాయింట్ తో తెరకెక్కిన ఈ మూవీ లో సత్యరాజ్ ఒక కీలక పాత్రలో నటించారు. గీతా ఆర్ట్స్ 2, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందిన ఈ మూవీ కి థమన్ సంగీతం అందించారు.
మెలోడీ బ్రహ్మ ఖాతాలో 'అసురన్' రీమేక్?
కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ `అసురన్`... తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో అనుష్క నాయికగా కన్‌ఫర్మ్ అయిందని టాక్. డి.సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా ఎంపికయ్యాడని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే... నేపథ్య సంగీతానికి ఎంతో ప్రాధాన్యమున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయ్యాడట. త్వరలోనే మణి ఎంట్రీపై ఫుల్ క్లారిటీ వస్తుంది.
నాగచైతన్యకి విలన్ గా అజయ్ భూపతి?
గత ఏడాది సంచలనం `ఆర్ ఎక్స్ 100`తో దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు అజయ్ భూపతి. మొదటి ప్రయత్నంలోనే నిర్దేశకుడిగా మన్ననలు పొందిన ఈ టాలెంటెడ్ టెక్నీషియన్... త్వరలో ప్రతినాయకుడి అవతారమెత్తుతున్నాడని టాక్.
బాలయ్యతో మరోసారి వేదిక?
నటసింహా నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం `రూలర్`లో ఇద్దరు నాయికల్లో ఒకరిగా నటిస్తోంది వేదిక. ఆ సినిమా విడుదలయ్యేలోపే... బాలయ్య సరసన మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ దక్కించుకుందట ఈ టాలెంటెడ్ బ్యూటీ.

10 భాషల్లో రిలీజ్ కానున్న'RRR'
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే షూటింగ్ పనులు పూర్తి చేసి మిగిలిన పనులు చేసుకోనుంది.
'భాగ్య నగర వీధుల్లో గమ్మత్తు' ట్రైలర్ రిలీజ్
ఇన్ని రోజులు తన కామెడీ తో.. మరోవైపు హీరోగా ఆకట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకున్న సంగతి తెలిసిందే. తనే దర్శక నిర్మాతగా మరి భాగ్య నగర వీధుల్లో గమ్మత్తు అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
విజయ్ ఆంటోని ‘జ్వాల’ ఫస్ట్‌లుక్ రిలీజ్
విభిన్నమైన సినిమా కథలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అభిమానులను ఏర్పరుచుకున్నాడు విజయ్ ఆంటోని. ఇప్పుడు మరో కొత్త కథతో వస్తున్నాడు. నవీన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ, అరుణ్ విజయ్, అక్షరా హాసన్ ముఖ్య పాత్రల్లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘అగ్ని సిరగుగల్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. తుది షెడ్యూల్‌ను కజకిస్తాన్‌లో షూట్ చేస్తున్నారు. కజకిస్తాన్‌లో షూటింగ్ జరుపుకుంటున్న తొలి ఇండియన్ సినిమా మాదే.
లక్ష్ 'వలయం' డబ్బింగ్ ప్రారంభం
రమేశ్ కడుముల దర్శకత్వంలో లక్ష్, దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న సినిమా 'వలయం'. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సమాజంలోని ఓ అంశాన్ని తీసుకుని కొత్త తరహా ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరో పక్క డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఈ సినిమా డబ్బింగ్ ను లక్ష్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.
'ఆర్ఆర్ఆర్' ఎన్టీఆర్ హీరోయిన్, విలన్ ఫిక్స్
మొత్తానికి ఇన్నిరోజులకు ఆర్ఆర్ఆర్ హీరోయిన్ విషయంలో క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్. గతకొద్దికాలంగా ఎన్టీఆర్ హీరోయిన్ ను ఎవరికి సెలెక్ట్ చేస్తారా..? ఎన్టీఆర్ పక్కన నటించే ఛాన్స్ ఎవరికి వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ‘ఒలివియా మోరిస్’ నటించనుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘ఒలివియా మోరిస్ కు స్వాగతం. మా సినిమాలో మీరు ప్రధాన పాత్ర అయిన ‘జెన్నిఫర్’ పాత్రను పోషిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. షూట్ కోసం ఎదురు చూస్తున్నాము’ అని పోస్ట్ చేశారు.
కింగ్ నాగార్జున రిలీజ్ చేసిన తూటా మూవీ ట్రైలర్
గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్, మేఘ ఆకాష్ జంటగా రొమాంటిక్ థ్రిల్లర్ ఎన్నై నోక్కి పాయిమ్ తోట్ట తమిళ మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ తూటా మూవీ గొలుగూరి రామకృష్ణారెడ్డి సమర్పణలో విజయభేరి వారి బ్యానర్ పై రూపొందింది. రెండు భాషలలోనూ ఈ మూవీ నవంబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. దర్భుక శివ సంగీతం అందించారు.
'శివ నిర్వాణ' తర్వాతే 'హీరో' అంటున్న విజయ్..!
క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో 'వరల్డ్ ఫేమస్ లవర్' రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను డిసెంబర్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
జార్జి రెడ్డి మూవీ సెన్సార్ పూర్తి
మిక్ మూవీస్, త్రి లైన్ సినిమాస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంట్ లీడర్ జార్జి రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా జీవం రెడ్డి దర్శకత్వంలో వంగవీటి మూవీ ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా రూపొందిన జార్జి రెడ్డి మూవీ నవంబర్ 22 వ తేదీ రిలీజ్ కానుంది. బాక్సర్, గోల్డ్ మెడలిస్ట్ జార్జిరెడ్డి విప్లవాత్మక ధోరణి ఆకర్షింపబడి ఉస్మానియా యూనివర్శిటీ లో 1967 -1972 వరకు ఉన్నారు. PDSU స్టూడెంట్ యూనియన్ ను స్థాపించారు. 1972 సంవత్సరంలో మర్డర్ కాబడ్డారు.

'90ML' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు
శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా '90ML' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేసింది. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటీకే టీజర్ ను పాటలను రిలీజ్ చేయగా తాజాగా టైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. రేపు ఉదయం 10.35 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.