కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 18

సినిమా వార్తలు

ర్యాప్ సింగర్ సూర్య

2డి ఎంటర్ టైన్ మెంట్, సిఖ్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సుధకొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా సూరరై పోట్రు తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి .ఆర్. గోపినాథ్ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ లో అపర్ణ బాలమురళి కథానాయిక. మోహన్ బాబు, జాకీ ష్రాఫ్, పరేష్ రావల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జి వి ప్రకాష్ సంగీతంఅందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హిందీ 'జెర్సీ' కి హీరోయిన్ ఫిక్స్..!

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు... విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. అర్జునరెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ ఈ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే షాహిద్ కపూర్ ట్రైనింగ్ కూడా మొదలుపెట్టేసాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మరో క్రేజీ ప్రాజెక్ట్ లో రమ్యకృష్ణ

అల్లు అరవింద్ సమర్పణ లో రినైసెన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్స్ బ్యానర్స్ పై నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న మూవీ అక్టోబర్ 10 వ తేదీ పూజ కారక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించనున్న ఈ థ్రిల్లర్ మూవీ లో వరుణ్ తేజ్ మదర్ క్యారెక్టర్ కు రమ్య కృష్ణ ఎంపికయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రతి రోజూ పండగే సెకండ్ సింగిల్ రిలీజ్

అల్లు అరవింద్ సమర్పణ లో గీతా ఆర్ట్స్ , యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై సాయితేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రతి రోజూ పండగే మూవీ డిసెంబర్ 20వ తేదీ రిలీజ్ కానుంది. ప్రతి రోజూ పండగే మూవీ సెకండ్ సింగిల్ ఓ బావా సాంగ్ ప్రసాద్ ల్యాబ్ లో రిలీజయిన సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా తో సమావేశమయ్యారు. హీరో సాయి తేజ్ మాట్లాడుతూ .. మీడియా నుండి అద్భుతమైన సపోర్ట్ వస్తుందని, థమన్ మంచి సంగీతం అందించారని, ఈ మూవీ అందరినీ అలరిస్తుందని, మనల్ని మనం ప్రశ్నించుకొనే చిత్రమిదనీ అన్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

అట్లీ - షారుఖ్ మూవీ షూటింగ్ అప్ డేట్..!

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రకటన ఇచ్చేసారు. పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ అట్లీ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ 2 రిలీజ్ డేట్

సంచలన దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ మరొక వివాదస్పద సినిమా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' తో అభిమానుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్‌మెంట్‌ దగ్గర నుంచే వివాదాస్పదమైంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు విడుదల చేసి ఆసక్తిని రేపుతున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తర్వాత సినిమా హైదరాబాద్ దాదాగిరిపై..!

రోజుకో పోస్ట్ తో.. రోజుకో అప్ డేట్ తో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాకు మరింత క్రేజ్ తీసుకొస్తున్నాడు వర్మ. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతోనే సగం దుమారం రేపాడు. అక్కడితో ఆగకుండా ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్ లు రిలీజ్ చేస్తూ మరిన్ని వివాదాలకు తెరలేపుతున్నాడు. అంతే కాదు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమాకు సీక్వెల్ తీయనున్నట్టు కూడా తెలిపాడు. టీడీపీకి గుడ్ బై చెప్పిన వల్లభనేని వంశీ ఫైర్ అవుతున్న ఇంటర్వ్యూలు చూసిన తర్వాత తనకు ఈ ఐడియా వచ్చిందని..ఈ సీక్వెల్ కు 'రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్' అనే టైటిల్ పెడతానని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరో శ్రీవిష్ణు కు జోడీ గా కాజల్ అగర్వాల్ ?

2007 సంవత్సరం లో లక్ష్మీ కళ్యాణం మూవీ తో టాలీవుడ్ కు ,2008 సంవత్సరంలో పళని మూవీ తో కోలీవుడ్ కు ఎంటర్ అయిన కాజల్ అగర్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని, స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. కాజల్ అగర్వాల్ నటించిన పలు తెలుగు, తమిళ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. తెలుగు, తమిళ స్టార్ హీరోల చిత్రాలలో కాజల్ నటించారు. 12 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ కు సీనియర్ హీరోల మూవీస్ తో బాటు యువ హీరోల మూవీస్ లో కూడా ఆఫర్స్ రావడం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వచ్చే ఏడాది రెండు సినిమాలు - కుదిరితే వెబ్ సిరీస్ కూడా...!

'గౌరవం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శిరీష్ ఇంకా కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోలేదనే చెప్పొచ్చు. 'కొత్తజంట', 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాలు కాస్త హిట్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ గా మాత్రం వర్క్ అవుట్ కాలేదు. ఇక ఇటీవలే మలయాళం హిట్ మూవీ ‘ఏబీసీడీ’ ని రీమేక్ చేయగా అది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీనితో ఓ మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు అల్లు శిరీష్ ఎప్పటినుండో.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

యమదొంగ మూవీ తమిళ డబ్బింగ్ వెర్షన్ "విజయన్"

విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ మూవీస్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఫాంటసీ , యాక్షన్ కామెడీ యమదొంగ మూవీ 2007 సంవత్సరం ఆగస్ట్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రియమణి, మమతా మోహన్ దాస్ కథానాయికలు కాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక కీలక పాత్రలో నటించారు. కీరవాణి స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకుల కు వీనుల విందు చేశాయి. యమదొంగ మూవీ ప్రేక్షకులను అలరించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'సరిలేరు నీకెవ్వరు' అవన్నీ రూమర్లేనట..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.ఇక ఒకపక్క షూటింగ్ ను జరువుకుంటూనే, మరోపక్క ప్రమోషన్స్ పనులను కూడా వేగవంతం చేసింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వేస‌వి బ‌రిలో 'అసుర‌న్' రీమేక్‌?

త‌మిళ‌నాట క‌ల్ట్ క్లాసిక్ అనిపించుకున్న `అసుర‌న్‌` చిత్రం... ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని డి.సురేష్ బాబు, క‌లైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. ఈ చిత్రంలో వెంకీకి జోడీగా శ్రియ న‌టిస్తుంద‌ని... అలాగే `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` ఫేమ్‌ శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌కుడిగా క‌న్‌ఫ‌ర్మ్ అయ్యాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. కాగా... ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌కి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్‌ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో ప్రారంభిస్తార‌ని... ఆపై చ‌క‌చ‌కా చిత్రీక‌ర‌ణ జ‌రిపి వేస‌వి కానుక‌గా మే నెల‌లో సినిమాని జనం…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రోసారి సూర్య‌, అనుష్క జోడి?

కోలీవుడ్ స్టార్ సూర్య‌కి అచ్చొచ్చిన ద‌ర్శ‌కుల్లో గౌత‌మ్ మీన‌న్ ఒక‌రు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన `కాక్క కాక్క‌` (`ఘ‌ర్ష‌ణ‌`కి మాతృక‌), `వార‌ణ‌మ్ ఆయిర‌మ్‌` (తెలుగులో `సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్‌`) త‌మిళ‌నాట ఘ‌న‌విజ‌యం సాధించాయి. క‌ట్ చేస్తే.. ప‌న్నెండేళ్ళ సుదీర్ఘ విరామం త‌రువాత ఈ స‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో సినిమా రానుంద‌ని టాక్‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'లాయ‌ర్ సాబ్‌' గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌?

త‌న సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్ `అజ్ఞాత‌వాసి` త‌రువాత క్రియాశీల‌క రాజ‌కీయాల‌తో బిజీ అయిపోయారు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. కాగా, రెండేళ్ళ విరామం అనంత‌రం.. వెండితెర‌పై మ‌రోసారి వెలుగులు పంచేందుకు ఈ టాలెంటెడ్ స్టార్ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నార‌ని టాక్‌. అంతేకాదు... హిందీనాట సంచ‌ల‌న విజ‌యం సాధించిన కోర్టు డ్రామా `పింక్‌`ని రీమేక్ చేస్తూ... త‌న రీ-ఎంట్రీకి రెడీ అవుతున్నార‌ట‌. `దిల్‌` రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ చిత్రానికి `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని వినికిడి. అలాగే ప‌వ‌న్ స‌న్నిహితుడు, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ఈ రీమేక్‌కి సంభాష‌ణ‌లు అందించ‌నున్నారట‌…

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

చిరంజీవి - కొర‌టాల చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్స‌య్యిందా?

ఇటీవ‌ల `సైరా న‌ర‌సింహారెడ్డి`తో అభిమానుల‌ను అల‌రించిన మెగాస్టార్ చిరంజీవి... త్వ‌ర‌లో త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌నున్నారు. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ... ద‌స‌రా సంద‌ర్భంగా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. కాగా... ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ ని డిసెంబ‌ర్‌లో ప్రారంభించ‌నున్నార‌ని... ఆపై నిర‌వ‌ధికంగా చిత్రీక‌ర‌ణ జ‌రిపి స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్టు 14న విడుద‌ల చేసే దిశ‌గా ప్రణాళిక జ‌రుగుతోంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రేమక‌థ‌ల్లో కొత్త కోణాన్ని ఆవిష్క‌రించిన‌ ‘ప్రేయసి రావే’కు 20 ఏళ్ళు

ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే అది ఒక మహా సముద్రం. దాని గురించి చెప్పే కొద్దీ కొత్త కొత్త నిర్వచనాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆకర్షణ, కోపం, ఇష్టం, బాధ, విసుగు, నవ్వు... ఇలా సకల భావోద్వేగాల మేళవింపే ప్రేమ‌. కాబట్టే తెలునాట‌ పలు ప్రేమకథా చిత్రాలు అలరించాయి. అలరిస్తూనే ఉంటాయి. అయితే... రొటీన్‌కు భిన్నంగా సాగే ప్రేమకథలు మాత్రం చాలా అరుదుగా వ‌స్తూ ఉంటాయి. అలా వ‌చ్చిన అరుదైన ప్రేమకథలలో ‘ప్రేయసి రావే’ ఒకటి. ప్రేమక‌థ‌ల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, రాశి నాయకానాయికలుగా నటించారు. అంతేకాదు... త‌మ అద్భుత‌ అభిన‌యంతో పాత్ర‌ల‌కు జీవం పోశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

లవ్ అండ్ హేట్ - భీష్మ లో ఇదే హైలైట్ అట..!

‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే...మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి రీసెంట్ గా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియో కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూ ట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

మహేష్ మేనల్లుడి సినిమా - ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

టిడిపి ఎంపి గల్లా జ‌యదేవ్, మహేష్ బాబు మేనల్లుడు గ‌ల్లా అశోక్ హీరో గా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక అప్పుడు ఈషూటింగ్ ను స్టార్ట్ చేసిందో లేదో.. అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్నీ చిత్రయూనిట్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ చిత్ర ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తయింది... ఈ సంద‌ర్భంగా గ‌ల్లా జ‌య‌దేవ్ సెట్స్‌కి వెళ్లి టీం అంద‌రితో స‌ర‌దాగా గడిపారని ద‌ర్శ‌కుడు శ్రీరామ్‌ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్...!

త్రివిక్రమ్ తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ కథ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండనున్నట్టు గతంనుండే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలోని శేషాచలం ప్రాంతంలో ఓ భారీ సెట్టింగ్‌కి ప్లాన్ చేసినట్టు సమాచారం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సుమంత్ కొత్త సినిమా టైటిల్ రిలీజ్

ఇటీవల సుబ్రహ్మణ్యపురం సినిమాతో ప్రేక్షకులను అలరించిన సుమంత్ ఇప్పుడు మరో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో కొత్త సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రియేటివ్ ఎంటర్టైనర్స్ పతాకంపై ధనంజయన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్