నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 105వ చిత్రం `రూలర్`ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 20న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ లోపే బాలయ్య తన నెక్ట్స్ వెంచర్ ని ప్రారంభించబోతున్నారని టాక్. తనకు అచ్చొచ్చిన దర్శకుల్లో ఒకరైన బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేయబోతున్న ఈ సినిమాని డిసెంబర్ 9న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచారం. అయితే, రెగ్యులర్ షూటింగ్ ని మాత్రం వచ్చే ఏడాది జనవరిలో మొదలుపెట్టే అవకాశముందని వినికిడి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో బాలయ్య రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో కనిపించనున్నారని టాక్. సంజయ్ దత్ విలన్‌గా నటించనున్న ఈ సినిమాకి అనిరుధ్ బాణీలు అందిస్తాడని ప్రచారం సాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరి… `సింహా`, `లెజెండ్` తరువాత బాలయ్య, బోయపాటి కాంబోలో రానున్న ఈ చిత్రం కూడా బ్లాక్‌బస్టర్ బాట పడుతుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























