స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ఓ యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బన్నీ స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని టాక్. కాగా… ఈ సినిమాలో బన్నీకి జోడీగా కన్నడ కస్తూరి రష్మికా మందన్న నటించనున్న విషయం విదితమే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఇందులో ఈ ఇద్దరూ భార్యాభర్తలుగా దర్శనమివ్వనున్నారని సమాచారం. అంతేకాదు… వీరి పెళ్ళికి సంబంధించిన సన్నివేశంతోనే సినిమా మొదలవుతుందని తెలిసింది. అలాగే దంపతులుగా వీరి మధ్య సాగే సన్నివేశాలు చాలా రొమాంటిక్‌గా ఉండడమే కాకుండా చిత్రానికి ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయని వినికిడి. మరి… ఆలుమగల పాత్రల్లో రష్మిక, బన్నీ ఏ స్థాయిలో రంజింపజేస్తారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: