మొత్తానికి మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అప్ డేట్ రానే వచ్చింది. ఇన్ని రోజులు కేవలం పోస్టర్ లను రిలీజ్ చేస్తుండగా ఈ సినిమా టీజర్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు కాస్త ఊరటనిచ్చేవిధంగా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. నవంబర్ 22వ తేదీన ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా తమ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
I have Unlocked #SarileruNeekevvaru Teaser Date🔥. Now it’s ur turn to Unlock. Super Star @urstrulyMahesh @AnilRavipudi #SarileruNeekevvaruTeaserOnNov22nd
— AK Entertainments (@AKentsOfficial) November 19, 2019
కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలచేయనున్నారు. ఇక మహేష్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: