విజయ్ కు కూడా అదే హీరోయిన్ అంటున్న పూరీ..!

Puri Jagannadh To Repeat iSmart Heroine,Puri Jagannadh Next With Vijay Deverakonda,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Director Puri Jagannadh Next Upcoming Movie,Vijay Deverakonda New Movie Details

నేను ఒక్కసారి కమిట్ అయితే ఎవ్వరి మాట వినను అని పూరీ జగన్నాథ్ పోకిరి సినిమాలో మహేష్ చెప్పించాడు. నిజానికి అవి చెప్పింది మహేష్ అయినా కూడా పూరీ వ్యక్తిత్వం కూడా అలానే ఉంటుందని మనకు తెలిసిందే. ఇక తన సినిమాల్లో కూడా కొన్ని కామన్ పాయింట్స్ ను చూస్తుంటాం. ఇదిలావుంచితే తనకు కలిసొచ్చిన హీరోయిన్ ను కూడా పూరీ రిపీట్ చేస్తూనే ఉంటాడు. రక్షిత, ఇలియానా, కాజల్ వీరందరితో ఒకటికి పైగా సినిమాలు చేసాడు. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో భామ కూడా చేరనుంది. ఆమె ఎవరో కాదు ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ సరసన నటించే హీరోయిన్ ఎవరనే విషయంలో ఇంతవరకూ క్లారిటీ రాలేదు. అయితే మొదట ఈ చిత్రంలో హీరోయిన్ గా అలనాటి అందాల తార దివంగత శ్రీదేవి కూతురు జాన్వీని తీసుకొచ్చే ప్రయత్నం పూరీ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో వార్తవినిపిస్తుంది. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నే ఫైటర్ మూవీకి హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నిధిని అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా బిజీలో వున్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను తెలుపనున్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత పూరీ-విజయ్ కంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఫైటర్ అనే టైటిల్ ను ఈ సినిమాకు పెట్టనున్నట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − six =