‘ఆర్ఆర్ఆర్’ నుండి బిగ్ అప్ డేట్ – రూమర్లకు చెక్ పెడతాం..!

RRR Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,Jr NTR And Ram Charan RRR Movie Live Updates

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. రామోజీ ఫిలింసిటీలో ప్ర‌త్యేకంగా నిర్మించిన సెట్ల‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది.ఈ షెడ్యూల్ లో రామ్ చ‌ర‌ణ్ పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్రబృందం సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 70% షూట్ పూర్తయిందని తెలిపారు. ఇక ఎన్టీఆర్ సరసన నటిస్తోన్న హీరోయిన్ ను అలాగే ఈ సినిమాలో ప్రతినాయకుడు ఎవరు చేస్తున్నారో రేపు ప్రకటించనున్నామని.. ఈ విషయాల్లో వస్తున్న రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టనున్నామని చిత్రబృందం ట్వీట్ చేసింది.

కాగా స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో దానయ్య డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30 న విడుదలకానుంది..

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − seven =