తమిళనాట ఘనవిజయం సాధించిన `అసురన్`… తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని ప్రముఖ నిర్మాతలు డి.సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. శ్రీకాంత్ అడ్డాల ఈ రీమేక్‌ని డైరెక్ట్ చేస్తాడని ప్రచారం సాగుతోంది. కాగా… ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో వెంకీకి జోడీగా అనుష్క నటించే అవకాశముందని టాక్. వాస్తవానికి, ఈ పాత్ర కోసం ఇదివరకు శ్రియ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, అనుష్క ఆ పాత్రలో నటిస్తుందని సమాచారం. అభినయానికి అవకాశమున్న డీ-గ్లామర్ రోల్ కావడంతో స్వీటీ కూడా ఆసక్తి చూపిస్తుందని వినికిడి. త్వరలోనే అనుష్క ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదివరకు వెంకీ, స్వీటీ `చింతకాయల రవి`, `నాగవల్లి` చిత్రాల్లో కలసి నటించారు. సుదీర్ఘ విరామం తరువాత ఈ ఇద్దరి కలయికలో సినిమా రానుండడం విశేషం.
కాగా… జనవరిలో సెట్స్ పైకి వెళ్ళనున్న `అసురన్` రీమేక్… వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లలో సందడి చేయనుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: