విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మాణ సారథ్యం లో లెజండరీ యాక్ట్రెస్, తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న తలైవి మూవీ షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్, లెజండరీ యాక్టర్, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎమ్ జి రామచంద్రన్ పాత్రలో ట్యాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి నటిస్తున్నారు. ఇతర పాత్రలలో ప్రముఖ నటీనటులు నటించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డైనమిక్ పొలిటికల్ లీడర్ జయలలిత జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా రూపొందుతున్న తలైవి మూవీ లో లెజండరీ యాక్టర్ , ఆంధ్ర ప్రదేశ్ దివంగత ముఖ్య మంత్రి ఎన్ టి రామారావు పాత్రకు కూడా ఆవశ్యకత ఉంది. ఈ మూవీ లో ఎన్టీఆర్ పాత్రను అతిథి పాత్రగా రూపొందించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రకై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను సంప్రదించనున్నట్టు సమాచారం. తాత ఎన్టీఆర్ పాత్రలో నటించలేనని, ఆ మ్యాజిక్ తాను క్రియేట్ చేయలేనని జూనియర్ ఎన్టీఆర్ పలు సందర్భాలలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రపోజల్ ను యంగ్ టైగర్ అంగీకరిస్తారో లేదో కాలమే చెప్పాలి. ఒక వేళ అంగీకరిస్తే ఆ వార్త నందమూరి అభిమానులకు థ్రిల్ కలిగిస్తుందనడం లో సందేహం లేదు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: