నిన్ను చూస్తే గర్వం గా ఉంది సితు పాపా – మహేష్ బాబు

Mahesh Babu Feels Proud At His Daughters Feat,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Mahesh Babu Calls Daughter Sitara Confident,Mahesh Babu About Sitara,Mahesh Babu Latest News 2019

క్రిస్ బక్ , జెన్నిఫర్ లీ దర్శకత్వంలో ఎల్సా, అన్నా ప్రధాన పాత్రలలో వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ నిర్మించిన 3డి కంప్యూటర్ యానిమేటెడ్ ఫాంటసీ మూవీ ఫ్రోజన్ 2013 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇప్పడు ఆ మూవీ కి సీక్వెల్ ఫ్రోజన్2మూవీ రూపొంది ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 22 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లోని రాకుమారి ఎల్సా పాత్రకు హిందీ లో ప్రియాంక చోప్రా, తెలుగు లో నిత్యా మీనన్, తమిళం లో శృతి హాసన్ డబ్బింగ్ చెప్పడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫ్రోజన్ 2 తెలుగు వెర్షన్ లో చిన్నారి రాకుమారి ఎల్సా కు సూపర్ స్టార్ తనయ సితార డబ్బింగ్ చెప్పారు. సితార డబ్బింగ్ విషయం పై మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తన స్పందన తెలియజేశారు . ఆమె నిజంగా క్వీన్ ఎల్సా కు మినీ వెర్షన్ అనీ , సితు పాప ను చూస్తుంటే గర్వంగా ఉందని, తన కుమార్తె గొంతు ను తొలిసారిగా వెండితెర పై వినేందుకు నవంబర్ 22 తేదీ వరకు ఆగలేను అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + five =