ఫైనల్లీ ‘అర్జున్ సురవరం’ సినిమాకు మంచి రోజులు వచ్చాయి. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని అన్ని కార్యక్రమాలకు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మాత్రం రిలీజ్ కష్టాలు మాములుగా రాలేదు. పలుమార్లు రిలీజ్ డేట్ వాయిదా పడటంతో అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనుకున్నారు అంతా.. ఎట్టకేలకు ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. నవంబర్ 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మూసాపేట్ లోని శ్రీరాములు థియేటర్ లో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
కాగా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ కి రీమేక్ గా నిఖిల్ హీరోగా అర్జున్ సురవరం పేరుతో ఈ సినిమా రీమేక్ అయింది. టి.ఎన్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈసినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. బి. మధు సమర్పణలో మూవీస్ డైనమిక్స్ ఎల్ఎల్పీ &ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు. మరి అక్కడ సూపర్ హిట్ అయిన ఈసినిమా ఇక్కడ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: