
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 94


రవితేజతో వి.వి.వినాయక్ నెక్ట్స్ ప్రాజెక్ట్?

నాని, శర్వానంద్ ఒకే తేదిని టార్గెట్ చేశారా?

వినరా సోదర వీరకుమారా ట్రైలర్ రిలీజ్

మరోసారి తన సత్తా చాటిన లేడి సూపర్ స్టార్

ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్?

స్పెషల్ డే రోజు షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 2!

ఇన్నాళ్లకు ఇండియన్ డాక్యుమెంటరీకి ఆస్కార్

చైతు కోసం విషాదాంతమైన ప్రేమ కథ!

యాత్ర త్రీ వీక్స్ కలెక్షన్స్

ఇంద్రగంటి సినిమాలో నాని డిఫరెంట్ రోల్

రజనీకాంత్ తరువాత ధనుష్‌తో...?

విశ్వామిత్ర ట్రైలర్ రిలీజ్

ఈ ఏడాది మూడు సినిమాలతో సందడి చేయనున్న నాని!

`జెర్సీ`లో నాని స్పెషల్ టచ్...

కౌషల్ పై కౌషల్ ఆర్మీ ఫైర్
బిగ్ బాస్2.. బిగ్ బాస్ 1 ఎప్పుడు వచ్చింది.. ఎప్పుడు పోయిందో ఎవరికి కూడా తెలియదు కానీ.. బిగ్ బాస్2 మాత్రం ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది. అంతలా ఈ సీజన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దీనికి కారణం మనందరికీ తెలిసిందేక. కౌషల్ మండా. మొదటి రెండు వారాలు బిగ్ బాస్ సీజన్ 2 ను పెద్దగా పట్టించుకోని ప్రేక్షకులు ఆ గేమ్ షాలో వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ అయిన కిరిటీ కెప్టన్ టాస్క్ లో కౌషల్ పై కాస్త అతిగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా గేమ్ మారిపోయింది. ఆ రోజు నుండి గేమ్ పైనా... ముఖ్యంగా కౌషల్ పైన ప్రేక్షకులు కాన్సన్ ట్రేషన్ చేయడం మొదలుపెట్టారు.

హ‌్యాట్రిక్‌కి సిద్ధమవుతున్న కాంబినేషన్స్
కొన్ని కాంబినేషన్‌లు బాక్సాఫీస్ వద్ద భలేగా మ్యాజిక్ చేస్తాయి. అందుకే వారి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుందంటే... సహజంగానే ఆసక్తి, అంచనాలు పెరుగుతాయి. ప్రస్తుతం... అలా మూడు కాంబినేషన్(హీరో-డైరెక్టర్)లు హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...

రవితేజతో వి.వి.వినాయక్ నెక్ట్స్ ప్రాజెక్ట్?
మాస్ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించడంలో స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ శైలే వేరు. దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ కలసి పనిచేయడమే కాదు... పలు విజయాలను కూడా అందుకున్నారాయన. సుదీర్ఘ విరామం తరువాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీ- ఎంట్రీ ఇచ్చిన `ఖైదీ నంబర్ 150`ని కూడా జనరంజకంగా తెరకెక్కించి... అలరించాడు వినాయక్.

నాని, శర్వానంద్ ఒకే తేదిని టార్గెట్ చేశారా?
నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం `జెర్సీ`, శర్వానంద్ పేరు నిర్ణయించని అప్‌కమింగ్ ప్రాజెక్ట్ (సుధీర్ వర్మ దర్శకుడు)... వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల మధ్య నెలకి పైగా గ్యాప్ ఉండనుంది. అయితే... ఈ ఇద్దరి తదుపరి చిత్రాలు మాత్రం ఒకే రోజున విడుదలయ్యే అవకాశముందని టాలీవుడ్ టాక్.

సామ్ `మాయ`కి 9 ఏళ్ళు
ఇప్పటి కథానాయికల్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న హీరోయిన్ ఎవరంటే... నిస్సంకోచంగా వినిపించే పేరు అందాల తార సమంతనే. `ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్` అంటారు... అలా తొలి అడుగులోనే ఎంతో ఇంప్రెస్ చేసి మరీ విజయాన్ని అందుకున్న ఈ చెన్నై బ్యూటీ... ఆ తరువాత వెనక్కు తిరిగి చూసే పరిస్థితి రాలేదు. ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా తొమ్మిదేళ్ళుగా వెండితెరపై అందాల సామ్ చేస్తున్న `మాయ`కి ముగ్థులై ఇంకా ఆ మైమరపులోనే ఉన్నారు ఆమె అభిమానులు.

వినరా సోదర వీరకుమారా ట్రైలర్ రిలీజ్
శ్రీనివాససాయి, ప్రియాంకజైన్ హీరో హీరోయిన్లుగా ‘ వినరా సోదర వీరకుమారా‘ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకం పై లక్ష్మణ్ క్యాదారి నిర్మిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమాలోని ఒక పాట తెల్లవారి కోడికన్న ముందు లేసి.. అనే పాటను డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాలోని ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఎన్టీఆర్ మహానాయకుడు త్రీ డేస్ కలెక్షన్స్
క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నట సార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ మహానాయకుడు పార్ట్ ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బాగానే మౌత్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల్ పరంగా కాస్త ఢీలా పడిందనే చెప్పొచ్చు. మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 2 కోట్లు మాత్రమే రాబట్టిందంటేనే అర్ధంచేసుకోవచ్చు.. కలెక్షన్ల్ పరంగా ఈ సినిమా ఎంత వీక్ ఉందో. మరి ఈ మూడు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం.

మరోసారి తన సత్తా చాటిన లేడి సూపర్ స్టార్
నయనతార, అనురాగ్ కశ్యప్, విజయ్ సేతుపతి, అథర్వా , రాశిఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఇమైక్క నొడిగళ్. తమిళంలో తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమాను తెలుగులో అంజలి సీబీఐ అనే పేరుతో నిన్న విడుదల చేశారు. ఇక తెలుగులో రిలీజైన ఈ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్?
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో నటించే హీరోయిన్లను అధికారికంగా ప్రకటించారు. ఒక హీరోయిన్ నిథి అగర్వాల్ ను ఎంపిక చేయగా.. మరో హీరోయిన్ నభానటేష్ ను ఎంపిక చేశారు. ఇక ఈ సినిమాలో రామ్ ది ఫుల్ మాస్, తెలంగాణ యాస మాట్లాడే కారెక్టర్ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి.

స్పెషల్ డే రోజు షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 2!
సుజిత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సాహో. భారీ బడ్జెట్ తో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవలే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సాహో షేడ్స్ ఆఫ్ చాప్టర్ 1 అంటూ ఇటీవల ఓ వీడియోను విడుదల చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు చిత్రయూనిట్. షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 2 అంటూ మరో వీడియో ను విడుదల చేయనున్నారు. మార్చి 3వ తేదీన శ్రద్ధ కపూర్ బర్త్ డే సందర్భగా చాప్టర్ 2ను విడుదలచేయనున్నారు.

ఇన్నాళ్లకు ఇండియన్ డాక్యుమెంటరీకి ఆస్కార్
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో 91వ ఆస్కార్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే ఈసారి మన భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి అవార్డు దక్కింది.రేకా జెహతాబ్చి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత గునీత్ మోంగా నిర్మించిన 'పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్' అనే డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్ లభించింది. ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు ఆస్కార్ కు నామినేట్ అవ్వడం తప్ప అవార్డును గెలుచుకోలేకపోయాయి. కానీ ఈ 25 నిమిషాల నిడివి గల డాక్యుమెంటరీకి అవార్డ్ రావడం చాలా ఆనందంగా ఉందని అంటున్నారు దర్శక నిర్మాతలు. మరి ఇన్నాళ్లకు మనకు ఆస్కార్ అవార్డ్ లభించడం గర్వించతగ్గ విషయమే.

చైతు కోసం విషాదాంతమైన ప్రేమ కథ!
తెలుగులోనే కాదు అటు హిందీ సినిమాలకూ కథలు అందించి...అసాధారణమైన విజయాలను అందించిన రైటర్ కమ్ దర్శకుడు విజయేంద్ర ప్రసాద్. బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, సమరసింహా రెడ్డి మరియు తన తనయుడు రాజమౌళి సినిమాలు విక్రమార్కుడు, ఛత్రపతి, యమదొంగ, మగధీర, బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలు అందించారు ఈయన. ఇక హిందీలో భజరంగీ భాయిజాన్, మణికర్ణిక సినిమాలకూ కథలు అందించారు. అవి కూడా మంచి విజయాలు సాధించినవే. అలాంటి నేపథ్యంలో ఆయన ఒక కథను రచన చేస్తున్నాడనగానే సహజంగానే ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి కదా.

యాత్ర త్రీ వీక్స్ కలెక్షన్స్
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో వి. మహి రాఘవ్ దర్శకత్వంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర మంచి టాక్ ను సొంతం చేసుకొని విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. మరి ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు త్రీ వీక్స్ అవ్వొస్తుంది. ఈ త్రీ వీక్స్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

ఇంద్రగంటి సినిమాలో నాని డిఫరెంట్ రోల్
నేచురల్ స్టార్ నాని, సెన్సిబుల్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. నాని తొలి చిత్రం `అష్టా చమ్మా`తో పాటు మూడేళ్ళ క్రితం వచ్చిన `జెంటిల్ మన్`కి కూడా ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో... ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా రానుంది. అయితే... ఈ సారి పూర్తిస్థాయి కథానాయకుడి పాత్రలో కనిపించడం లేదు నాని. కాకపోతే... పాత్ర పరిధి తక్కువ అయినా... ఓ డిఫరెంట్ రోల్‌లో దర్శనమిస్తాడట.

వన్ మెన్ ఆర్మీ ఫస్ట్ లుక్ రిలీజ్
నూతన దర్శకుడు శివ దర్శకత్వంలో.. సందీప్ చీలంను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న సినిమా వన్ మెన్ ఆర్మీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరకుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. షూటింగ్ మొత్తం ఆస్ట్రేలియాలోనే జరుపుకుంటుంది ఈ సినిమా. ఇదిలా ఉండంగా ఈరోజు హీరో సందీప్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

రజనీకాంత్ తరువాత ధనుష్‌తో...?
తన తొలి చిత్రం `పిజ్జా`తో తమిళ ప్రేక్షకులనే కాదు తెలుగు ప్రేక్షకులనూ అలరించాడు దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్. ఆ తరువాత రూపొందించిన `జిగర్తండా`(ఇప్పుడు ఇదే సినిమాని హరీష్ శంకర్ `వాల్మీకి`గా తెరకెక్కిస్తున్నాడు)తో దర్శకుడిగా మరో మెట్టు ఎదిగాడు. తదనంతరం `ఇరైవి`, `మెర్క్యురీ` చిత్రాలతోనూ తమిళ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన కార్తిక్... ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో `పేట`తో పలకరించాడు. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రజనీ అభిమానుల మనసు దోచుకున్నాడు ఈ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్.

`118` ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అతిథులుగా బాలకృష్ణ, యన్టీఆర్!
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం `118`. నివేదా థామస్, షాలినీ పాండే కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి కె.వి.గుహన్ దర్శకత్వం వహించగా... మహేష్ కోనేరు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి... సెన్సార్ కమిటీ `యు/ఎ` సర్టిఫికేట్ జారీ చేసింది. మార్చి 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

విశ్వామిత్ర ట్రైలర్ రిలీజ్
గీతాంజలి, త్రిపుర వంచి థ్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేసిన డైరెక్టర్ రాజ కిరణ్. ఇప్పుడు మరోసారి అలాంటి జోనర్ లోనే విశ్వామిత్ర అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి వస్తున్నాడు. నందితా శ్వేత, సత్యం రాజేష్, అశుతోష్ రాణా, ప్రసన్న కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమాను మార్చి 21వ తేదీన రిలిజ్ చేయనున్నారు. ఇప్పుడుతాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఈ ఏడాది మూడు సినిమాలతో సందడి చేయనున్న నాని!
ఆ మధ్యంతా ఏడాదికి మూడు సినిమాలతో సందడి చేసిన యువ కథానాయకుడు నాని... గత ఏడాది మాత్రం కేవలం రెండు చిత్రాలకే పరిమితమయ్యాడు. నిరుడు `కృష్ణార్జున యుద్ధం`, `దేవదాస్` సినిమాలతో పలకరించిన ఈ నేచురల్ స్టార్... ఈ సంవత్సరం మాత్రం మరోసారి మూడు సినిమాలతో సందడి చేయనున్నాడు.

`జెర్సీ`లో నాని స్పెషల్ టచ్...
నేచురల్ స్టార్ నాని అప్‌కమింగ్ ప్రాజెక్ట్ `జెర్సీ` విడుదలకు ముస్తాబవుతోంది. వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో ఈ సినిమా తెరపైకి రానుంది. `మళ్ళీ రావా` ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో నాని... మిడిల్ ఏజ్డ్ క్రికెటర్ అర్జున్‌గా కనిపించనున్నాడు. అంతేకాదు... తన వయసుకు మించిన పాత్రలో తొలిసారిగా దర్శనమివ్వనున్నాడు ఈ నేచురల్ స్టార్.