నేచురల్ స్టార్ నాని అప్‌కమింగ్ ప్రాజెక్ట్ `జెర్సీ` విడుదలకు ముస్తాబవుతోంది. వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో ఈ సినిమా తెరపైకి రానుంది. `మళ్ళీ రావా` ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో నాని… మిడిల్ ఏజ్డ్ క్రికెటర్ అర్జున్‌గా కనిపించనున్నాడు. అంతేకాదు… తన వయసుకు మించిన పాత్రలో తొలిసారిగా దర్శనమివ్వనున్నాడు ఈ నేచురల్ స్టార్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే… ఇందులో నాని పాత్ర పేరు అర్జున్ కాగా, అతని కొడుకు పాత్ర (ఇందులోనూ నాని కనిపిస్తాడని టాక్) పేరు నాని కావడం విశేషం. నిజజీవితంలో నాని కొడుకు పేరు అర్జున్ కాగా… ఇప్పుడు అదే పేరు గల పాత్రలో నాని కనిపించనున్నాడు. ఇక కొడుకు పాత్రకి తన పేరు పెట్టడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మొత్తానికి… `జెర్సీ`కి క్యారెక్టర్ల పేర్ల పరంగా `నాని` స్పెషల్ టచ్ ఇచ్చాడన్నమాట. మరి… ఈ పేర్ల తాలూకు మ్యాజిక్ వెండితెరపై ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో చూడాలి.
[youtube_video videoid=aC0lLhI39Io]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: