తన తొలి చిత్రం `పిజ్జా`తో తమిళ ప్రేక్షకులనే కాదు తెలుగు ప్రేక్షకులనూ అలరించాడు దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్. ఆ తరువాత రూపొందించిన `జిగర్తండా`(ఇప్పుడు ఇదే సినిమాని హరీష్ శంకర్ `వాల్మీకి`గా తెరకెక్కిస్తున్నాడు)తో దర్శకుడిగా మరో మెట్టు ఎదిగాడు. తదనంతరం `ఇరైవి`, `మెర్క్యురీ` చిత్రాలతోనూ తమిళ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన కార్తిక్… ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో `పేట`తో పలకరించాడు. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రజనీ అభిమానుల మనసు దోచుకున్నాడు ఈ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… `పేట` తరువాత కార్తిక్ సుబ్బరాజ్ రూపొందించబోయే సినిమాపై క్లారిటీ వచ్చింది. రజనీ అల్లుడు, కోలీవుడ్ స్టార్ ధనుష్ కాంబినేషన్‌లో కార్తిక్ సుబ్బరాజ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందని కోలీవుడ్ టాక్. వాస్తవానికి… ధనుష్ కాంబినేషన్‌లో సినిమా చేయాలని కార్తిక్ చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నాడు. అయితే… అది ఇన్నాళ్ళకి కార్యరూపం దాల్చుతోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా… జూన్‌లో పట్టాలెక్కనుందని సమాచారం. త్వరలోనే ధనుష్, కార్తిక్ కాంబినేషన్ మూవీపై ఫుల్ క్లారిటీ వస్తుంది.
[youtube_video videoid=RF3fQHcB6pQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: