గీతాంజలి, త్రిపుర వంచి థ్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేసిన డైరెక్టర్ రాజ కిరణ్. ఇప్పుడు మరోసారి అలాంటి జోనర్ లోనే విశ్వామిత్ర అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి వస్తున్నాడు. నందితా శ్వేత, సత్యం రాజేష్, అశుతోష్ రాణా, ప్రసన్న కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమాను మార్చి 21వ తేదీన రిలిజ్ చేయనున్నారు. ఇప్పుడుతాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా రాజ కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్., రాజకిరణ్ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. కెమెరా..అనిల్ బండారి. మరి వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చుతుందో చూద్దాం.
[youtube_video videoid=O09oFtdivZU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: