నేచురల్ స్టార్ నాని, సెన్సిబుల్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. నాని తొలి చిత్రం `అష్టా చమ్మా`తో పాటు మూడేళ్ళ క్రితం వచ్చిన `జెంటిల్ మన్`కి కూడా ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో… ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా రానుంది. అయితే… ఈ సారి పూర్తిస్థాయి కథానాయకుడి పాత్రలో కనిపించడం లేదు నాని. కాకపోతే… పాత్ర పరిధి తక్కువ అయినా… ఓ డిఫరెంట్ రోల్‌లో దర్శనమిస్తాడట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమాపై స్పందించిన నాని… ఇంద్రగంటి ఓ హీరో(ఆ హీరో… సుధీర్ బాబు అని టాక్)తో రూపొందిస్తున్న సినిమాలో నేను ఓ చిన్న పాత్ర పోషిస్తున్నాను. అయితే… నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చిత్ర కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది అని తెలిపాడు.
వాస్తవానికి… ఈ సినిమాలో నాని విలన్ రోల్ చేస్తున్నాడని ఆ మధ్య కొన్ని కథనాలు వచ్చాయి. అయితే… నాని మాత్రం డిఫరెంట్ రోల్ అని చెప్పడంతో… ఆ పాత్రలో నెగెటివ్ టచ్ ఉంటుందా? లేదా? అన్నదానిపై మాత్రం క్లారిటీ రాలేదు. పాత్ర ఏదైనా… తన సహజ నటనతో అలరించే నాని… తన తొలి చిత్ర దర్శకుడు కాంబినేషన్‌లో చేస్తున్న ఈ చిత్రంతోనూ ఆకట్టుకుంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. నాని సిల్వర్ జూబ్లీ ఫిల్మ్(25వ చిత్రం)గాఆ తెరకెక్కుతున్న ఇంద్రగంటి కాంబినేషన్ మూవీ ఈ ఏడాది చివరలో తెరపైకి రానుంది.
[youtube_video videoid=bjl-gISLXzQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: