ఆ మధ్యంతా ఏడాదికి మూడు సినిమాలతో సందడి చేసిన యువ కథానాయకుడు నాని… గత ఏడాది మాత్రం కేవలం రెండు చిత్రాలకే పరిమితమయ్యాడు. నిరుడు `కృష్ణార్జున యుద్ధం`, `దేవదాస్` సినిమాలతో పలకరించిన ఈ నేచురల్ స్టార్… ఈ సంవత్సరం మాత్రం మరోసారి మూడు సినిమాలతో సందడి చేయనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… మిడిల్ ఏజ్డ్ క్రికెటర్‌గా నాని నటించిన `జెర్సీ` ఏప్రిల్‌లో విడుదల కానుండగా… విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న `గ్యాంగ్ లీడర్` ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తన తొలి చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని చేస్తున్న హ్యాట్రిక్ ప్రయత్నం ఈ ఏడాది చివరలో తెరపైకి రానుంది. మొత్తమ్మీద… మరోసారి నాని మూడు సినిమాలతో సందడి చేస్తూ… అభిమానుల్లో జోష్ పెంచనున్నాడు. మరి… ఈ చిత్రాలతో నేచురల్ స్టార్ హ్యాట్రిక్ కొడతాడేమో చూడాలి.
[youtube_video videoid=bjl-gISLXzQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: