నూతన దర్శకుడు శివ దర్శకత్వంలో.. సందీప్ చీలంను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న సినిమా వన్ మెన్ ఆర్మీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరకుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. షూటింగ్ మొత్తం ఆస్ట్రేలియాలోనే జరుపుకుంటుంది ఈ సినిమా. ఇదిలా ఉండంగా ఈరోజు హీరో సందీప్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో హీరో సందీప్ పక్కన మిస్ పూణే ట్విశ శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. మూడు సార్లు మిస్టర్ వరల్డ్ గా టైటిల్ కైవసం చేసుకొన్న కమల్ దీప్ కామ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాను అను ప్రొడక్షన్స్ లో అనసూయ రెడ్డి నిర్మిస్తున్నారు. పంకజ్ రాయ్, కామెరాన్ జేక్ సంయుక్తంగా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. విజయ్ వర్దన్ ఎడిటింగ్ చేస్తున్నారు. ఇక మిగిలిన షూటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెబుతున్నారు దర్శక నిర్మాతలు.
నటీనటులు..
సందీప్ చీలం – హీరో
ట్విశ శర్మ – హీరోయిన్ (మిస్ పూణే)
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: శివ
నిర్మాత: అనసూయ రెడ్డి
బ్యానర్: అను ప్రొడక్షన్స్,
సినిమాటోగ్రఫీ: పంకజ్ రాయ్, కామెరాన్ జేక్
ఎడిటర్: విజయ్ వర్ధన్ కావూరి
మ్యూజిక్ డైరెక్టర్: స్యాండి
స్టంట్స్: జుడ్ వైల్డ్
[youtube_video videoid=fOC4HTnqY6s]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: