తెలుగులోనే కాదు అటు హిందీ సినిమాలకూ కథలు అందించి…అసాధారణమైన విజయాలను అందించిన రైటర్ కమ్ దర్శకుడు విజయేంద్ర ప్రసాద్. బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, సమరసింహా రెడ్డి మరియు తన తనయుడు రాజమౌళి సినిమాలు విక్రమార్కుడు, ఛత్రపతి, యమదొంగ, మగధీర, బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలు అందించారు ఈయన. ఇక హిందీలో భజరంగీ భాయిజాన్, మణికర్ణిక సినిమాలకూ కథలు అందించారు. అవి కూడా మంచి విజయాలు సాధించినవే. అలాంటి నేపథ్యంలో ఆయన ఒక కథను రచన చేస్తున్నాడనగానే సహజంగానే ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. అయితే ఈసారి విజయేంద్రప్రసాద్ కథను రాసేది ఎవరికోసం అనుకుంటున్నారు? ఈసారి నాగచైతన్య కోసం ఒక ఆసక్తికరమైన కథను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అది కూడా అలనాటి అక్కినేని నాగేశ్వర్రావు గారు నటించి తెలుగు సినీ చరిత్రలోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచిన దేవదాసు సినిమా తరహా కథను రాస్తున్నారట. విషాదాంతమైన ఈ ప్రేమకథ మనసులను కదిలించే విధంగా వుంటుందని అంటున్నారు.
కాగా ప్రస్తుతం ‘వెంకీమామ’ సినిమా షూటింగులో పాల్గొంటున్న చైతూ, ఆ తరువాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాతనే విజయేంద్రప్రసాద్ కథతో సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. అయితే ఇది నిజమేనా.. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు? అన్న విషయాలు తెలియాలంటే మాత్రం అధికారికంగా ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
[youtube_video videoid=cq_RNItUllY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: