
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 90


`మజిలీ` కూడా అదే బాటలో...

అల్లు అర్జున్ చేతిలో స్టార్ డైరెక్టర్స్

ఆకట్టుకుంటున్న శర్వా డాన్ లుక్

సైంటిస్ట్ గా నిధిఅగర్వాల్

మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా అల్లు అర్జున్

ప్రేమకథా చిత్రమ్ -2 మూవీ ట్రైలర్ రిలీజ్ త్వరలో

ఇద్దరు హీరోలతో భారీ షెడ్యూల్ ప్లాన్

ప్రాణం ఖరీదు రిలీజ్ డేట్ ఫిక్స్

వినరా సోదర వీర కుమారా రిలీజ్ డేట్ ఫిక్స్

ఎన్నెన్నో ప్రత్యేకతల ప్రతిష్టాత్మక సాహసం సాహో

తమిళ్ హార్రర్ మూవీ రీమేక్ లో!

దిల్ రాజు ఖాతాలో మరో సక్సెస్

118 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

సర్వం తాళమయం తెలుగు ట్రైలర్ రిలీజ్

`96` రీమేక్‌కి టైటిల్ కుదిరిందా?

బన్నీ... ఇద్దరితోనూ మూడోసారి

`పంతం` దర్శకుడితో నిఖిల్ సినిమా?

మహేష్‌కి జోడీగా సాయిపల్లవి?

ఎఫ్ 2 క్లోజింగ్ కలెక్షన్స్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో... విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా వచ్చిన సినిమా ఎఫ్2. ఈ సంక్రాంతి పండుగకు బరిలో దిగి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎఫ్2 సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ విషయంలో రికార్డే సృష్టించింది. పెద్ద సినిమాలను సైతం పక్కకు నెట్టి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. అంతేగా అంతేగా అంటూ వెంకీ, వరుణ్ చేసిన కామెడీ అందరికీ నచ్చడంతో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇక ఈ సనిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

`మజిలీ` కూడా అదే బాటలో...
..ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్... ఇలా రెండు చోట్లా బెస్ట్ కపుల్ అనిపించుకున్న జంట అక్కినేని నాగచైతన్య, సమంత. `ఏమాయ చేసావె`, `మనం`, `ఆటోనగర్ సూర్య` చిత్రాల్లో జోడీగా నటించిన చైతూ, సామ్... ఐదేళ్ళ తరువాత కలసి నటిస్తున్న చిత్రం `మజిలీ`. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 5న సెల్యులాయిడ్ పైకి రానుంది.

అల్లు అర్జున్ చేతిలో స్టార్ డైరెక్టర్స్
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆ సినిమా తరువాత ఈ పదినెలల టైంలో ఏ ఒక్క సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో టాప్ డైరెక్టర్లే ఉన్నారనుకోండి. ఇప్పటికే త్రివిక్రమ్ తో ఒక సినిమా ఉంది. అయితే ఎప్పుడో పట్టాలెక్కాల్సింది కానీ ఇంకా జరగలేదు. ఇక ఎవరూ ఊహించని విధంగా.. అందరికీ షాకిస్తూ.. శివరాత్రి రోజున సుకుమార్ తో మరో కొత్త ప్రాజెక్ట్ ఉన్నట్టు ప్రకటించాడు.

ఆకట్టుకుంటున్న శర్వా డాన్ లుక్
సుధీర్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న సినిమాలో శర్వానంద్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో శర్వానంద్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం గత కొద్ది రోజులుగా స్పెయిన్ లో ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమాలో శర్వా ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈరోజు శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా డాన్ లుక్ లో ఉన్న శర్వా ప్రీ లుక్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక ప్రీ లుక్ అయితే అందరినీ ఆకట్టుకుంటుంది.

సైంటిస్ట్ గా నిధిఅగర్వాల్
సవ్యసాచి, Mr మజ్ను మూవీస్ ద్వారా టాలీవుడ్ కు పరిచయమయిన నిధిఅగర్వాల్, పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న ఇస్మార్ట్ శంకర్ మూవీ లో ఇద్దరు హీరోయిన్స్ లలో ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ లో నిధిఅగర్వాల్ పాల్గొన్నారు.

మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త. 10 నెలల గ్యాప్ తరువాత అల్లు అర్జున్ వరుస సినిమా కమిట్ మెంట్స్ తో బిజీగా మారారు. గీతా ఆర్ట్స్, హారిక &హాసిని బ్యానర్స్ పై అల్లు అర్జున్ హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ మూవీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ పై ఒక మూవీ అనౌన్స్ అయింది. ఈ రెండు సినిమాలు త్రివిక్రమ్ -అల్లు అర్జున్, సుకుమార్ -అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూడవ మూవీ కావడం విశేషం.

ప్రేమకథా చిత్రమ్ -2 మూవీ ట్రైలర్ రిలీజ్ త్వరలో
హీరో సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన హారర్ కామెడీ ప్రేమకథా చిత్రమ్ మూవీ 2013 సంవత్సరంలో రిలీజయి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రేక్షకులను భయపెడుతూ ఎంజాయ్ చేసేలా ఈ మూవీ రూపొందింది. ఈ మూవీ క్రిటిక్స్, ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.

ఇద్దరు హీరోలతో భారీ షెడ్యూల్ ప్లాన్
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’(వర్కింగ్ టైటిల్). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. గత కొద్ది రోజులుగా రామ్ చరణ్ తో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీ కరిస్తున్నారు రాజమౌళి.

ప్రాణం ఖరీదు రిలీజ్ డేట్ ఫిక్స్
పి. ఎల్. కె . రెడ్డి దర్శకత్వంలో ప్రశాంత్, అవంతిక హీరోహీరోయిన్లగా నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో నటిస్తోన్న సినిమా 'ప్రాణం ఖరీదు'. యన్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై పద్మప్రియ సమర్పణలో నల్లమోపు సుబ్బారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్‌ని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గారి చేతుల మీదగా రెండు రోజుల క్రితమే రిలీజ్ చేశారు. మైండ్ గేమ్ కాన్సెప్ట్ తో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

వినరా సోదర వీర కుమారా రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా ‘ వినరా సోదర వీరకుమారా‘ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకం పై లక్ష్మణ్ క్యాదారి నిర్మిస్తున్నారు.

ఎన్నెన్నో ప్రత్యేకతల ప్రతిష్టాత్మక సాహసం సాహో
కొన్ని సినిమాలు ప్రారంభించినప్పటి పరిస్థితులకు, ప్రారంభించాక ఎదురయ్యే పరిణామాలకు పొంతనే ఉండదు. ఒక మోస్తరు బడ్జెట్ తో , మీడియం రేంజ్ సినిమాగా ప్రారంభమై అనూహ్యంగా మల్టీ క్రోర్స్ భారీ చిత్రంగా షేప్ తీసుకుంటాయి కొన్ని చిత్రాలు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేసిన బాహుబలి వన్ అండ్ టు , ఇప్పుడు తాజాగా చేస్తున్న "సాహో" చిత్రాల ప్రారంభ అంచనాలకు తరువాత పెరిగిన "నిర్మాణ పరిమాణా"లకు సంబంధమే లేదు. ప్రాంతీయ భాషా చిత్రాలుగా ప్రారంభమై ఇండియన్ ఫిలిం ట్రేడ్ మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యే భారీ ప్రాజెక్ట్స్ గా టర్న్ అయ్యాయి బాహుబలి సిరీస్ అండ్ సాహో చిత్రాలు.

తమిళ్ హార్రర్ మూవీ రీమేక్ లో!
తన లుక్స్ తో, యాక్టింగ్ స్కిల్స్ తో అటు బాలీవుడ్ లోనే కాదు.. ఇటు తెలుగు, తమిళ్ లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది కియారా అద్వాని. ప్రస్తుతం తాను సందీప్ వంగా డైరెక్షన్ లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలసిందే. వాటితో పాటు కరణ జోహర్ సినిమాలోనూ.. అదేవిధంగా అక్షయ్ కుమార్ తో గుడ్ న్యూస్ అనే మరో సినిమాలోనూ నటించనుంది.

దిల్ రాజు ఖాతాలో మరో సక్సెస్
మరోసారి దిల్ రాజు లెక్క తప్పలేదుగా. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు దిల్ రాజు. నిర్మాతగా మాత్రమే కాదు... డిస్ట్రిబ్యూటర్ గా కూడా తాను ఎన్నో సక్సెస్ లు అందుకున్నాడు. ఒక సినిమాను చూసి.. ఆసినిమాలో ఎంత మ్యాటరుంది... సినిమాను కొనచ్చా? లేదా? అనే క్యాలిక్యులేషన్స్ వేయడంలో ఆయనకు ఆయనే సాటి. పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాల విషయంలో కూడా పక్కా కాలుక్యులేషన్ తో వుంటారు దిల్ రాజు. చిన్న సినిమాలైనా సరే కంటెంట్ ఉంటే తప్పకుండా ఆయన ప్రోత్సాహం అందిస్తారు. ఇన్నేళ్లలో ఆయన కొన్న.. నిర్మించిన సినిమాల్లో... కొన్ని సినిమాల విషయంలో ఆయన లెక్కలు…

118 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ '118'. నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్స్ గా..ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కొనేరు నిర్మించిన ఈ సినిమా మార్చి 1న విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది. కలెక్షన్ల పరంగా కూడా బాగానే రాబడుతుంది. మరి ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

సర్వం తాళమయం తెలుగు ట్రైలర్ రిలీజ్
అటు మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు జీవి ప్రకాష్ కుమార్. తాను హీరోగా సంగీత నేపథ్యంలో తెరకెక్కిన కొత్త సినిమా సర్వం తాళమయం. రాజీవ్ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మెరుపు కలలు, ప్రియురాలు పిలిచింది వంటి క్లాసిక్ మూవీస్ ను అందించిన రాజీవ్ మీనన్.. మళ్లీ ఇన్నేళ్లకు ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు.

`96` రీమేక్‌కి టైటిల్ కుదిరిందా?
`96`... గత ఏడాది తమిళనాట సంచలన విజయం సాధించిన చిత్రం. `ప్రేమ`ను `ప్రేమ`గా ప్రేమించేవాళ్ళంతా అందించిన విజయంగా... ఈ సినిమా ఫలితాన్ని వర్ణించారు సినీ విశ్లేషకులు. అలాంటి `96` ఇప్పుడు తెలుగు పలుకులతో అచ్చ తెలుగు వాతావరణంతో మరోసారి తెర రూపం దాల్చనుంది. తమిళ వెర్షన్ రూపకర్త సి.ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్‌ని కూడా రూపొందించనుండగా... ప్రముఖ నిర్మాత `దిల్` రాజు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నాడు. విజయ్ సేతుపతి, త్రిష పాత్రల్లో శర్వానంద్, సమంత దర్శనమివ్వనున్నారు. త్వరలోనే ఈ రీమేక్ వెర్షన్ పట్టాలెక్కనుంది.

బన్నీ... ఇద్దరితోనూ మూడోసారి
గత ఏడాది వేసవికి `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`తో పలకరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి... ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందివ్వకపోయినా నటుడిగా మాత్రం ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చింది. కాగా... భారీ విరామం తరువాత ఈ టాలెంటెడ్ హీరో... తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించనున్నాడు. ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం... ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్ళనుందని టాక్. అంతేకాదు... ఈ సినిమా చిత్రీకరణకు వెళ్ళకముందే... మరో ప్రాజెక్ట్‌కి కూడా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ఈ చిత్రం…

`పంతం` దర్శకుడితో నిఖిల్ సినిమా?
గత ఏడాది మార్చికి `కిరాక్ పార్టీ`తో పలకరించి అలరించిన యువ కథానాయకుడు నిఖిల్... ఈ సంవత్సరం మార్చికి `అర్జున్ సురవరం`తో సందడి చేయనున్నాడు. తమిళ హిట్ చిత్రం `గణితన్`కి రీమేక్‌గా రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్... ఈ నెల 29న సెల్యులాయిడ్ పైకి రానుంది. మహాశివరాత్రి సందర్భంగా నిన్న(సోమవారం) విడుదల చేసిన టీజర్... సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. కాగా... ఈ చిత్రం తరువాత కిషన్ దర్శకత్వంలో `శ్వాస` అనే ఇంట్రెస్టింగ్ మూవీని చేయనున్నాడు నిఖిల్. తాజాగా `118`లో ఆద్యగా అలరించిన టాలెంటెడ్ బ్యూటీ నివేదా థామస్ ఇందులో నాయికగా నటిస్తోంది.

అనిల్ రావిపూడి ఆ సీజన్‌నే టార్గెట్ చేసుకుంటున్నాడా?
అనిల్ రావిపూడి... ప్రస్తుతం తెలుగునాట ఈ పేరే ఓ సంచలనం. చిత్ర చిత్ర ప్రవర్ధనమానంగా ఎదుగుతున్నాడీ యువ దర్శకుడు. `పటాస్`తో మొదలైన అనిల్ దర్శకప్రస్థానం... `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`... ఇలా వరుస విజయాలతో ముందుకు సాగుతోంది. బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తున్న ఈ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్... తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో రూపొందించనున్న సంగతి తెలిసిందే. జూన్ లేదా జూలైలో పట్టాలెక్కనున్న ఈ మూవీ... సంక్రాంతికి విడుదల కానుందని సమాచారం.

మహేష్‌కి జోడీగా సాయిపల్లవి?
`ఫిదా`, `ఎంసీఏ` చిత్రాలతో తెలుగునాట రెండు వరుస విజయాలను అందుకున్న కథానాయిక సాయిపల్లవి. అయితే... గత ఏడాది విడుదలైన `కణం`, `పడి పడి లేచె మనసు` సినిమాలు ఈ టాలెంటెడ్ బ్యూటీకి ఆశించిన స్థాయి ఫలితాలను అందివ్వలేకపోయాయి. అయినప్పటికీ... ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ సాయిపల్లవిని వరించిందని టాలీవుడ్ టాక్.