పి. ఎల్. కె . రెడ్డి దర్శకత్వంలో ప్రశాంత్, అవంతిక హీరోహీరోయిన్లగా నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో నటిస్తోన్న సినిమా ‘ప్రాణం ఖరీదు’. యన్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై పద్మప్రియ సమర్పణలో నల్లమోపు సుబ్బారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్‌ని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గారి చేతుల మీదగా రెండు రోజుల క్రితమే రిలీజ్ చేశారు. మైండ్ గేమ్ కాన్సెప్ట్ తో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాాగా సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. మార్చి 15వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. కాగా ఈ సినిమాలో తారకరత్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో ప్రశాంత్, అవంతిక, షఫి, జెమినీ సురేష్, చిత్రం శ్రీను, ఫణి రాజమౌళి( జబర్దస్త్ ఫేమ్) సంజన తదితరులు నటిస్తున్నారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీత సమకూర్చగా… మరుధూరి రాజా మాటలు అందించారు.

[youtube_video videoid=ETOAWjINRN4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: