మరోసారి దిల్ రాజు లెక్క తప్పలేదుగా. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు దిల్ రాజు. నిర్మాతగా మాత్రమే కాదు… డిస్ట్రిబ్యూటర్ గా కూడా తాను ఎన్నో సక్సెస్ లు అందుకున్నాడు. ఒక సినిమాను చూసి.. ఆసినిమాలో ఎంత మ్యాటరుంది… సినిమాను కొనచ్చా? లేదా? అనే క్యాలిక్యులేషన్స్ వేయడంలో ఆయనకు ఆయనే సాటి. పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాల విషయంలో కూడా పక్కా కాలుక్యులేషన్ తో వుంటారు దిల్ రాజు. చిన్న సినిమాలైనా సరే కంటెంట్ ఉంటే తప్పకుండా ఆయన ప్రోత్సాహం అందిస్తారు. ఇన్నేళ్లలో ఆయన కొన్న.. నిర్మించిన సినిమాల్లో… కొన్ని సినిమాల విషయంలో ఆయన లెక్కలు తప్పాయేమో కానీ.. మ్యాగ్జిమమ్ సక్సెస్ లే ఆయనకు తెచ్చిపెట్టాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ ఏడాది ప్రారంభమే ఆయనకు శుభారంభం. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి బరిలో దిగిన ఎఫ్ 2 సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది. దిల్ రాజుకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా.. ఆ సినిమా థియేట్రికల్ రన్ ఇంకా ముగియక ముందే మరో సక్సెస్ అందుకున్నాడు. ఈసారి 118 సినిమా ద్వారా ఆ అదృష్టం కలిసొచ్చింది.
కళ్యాణ్ రామ్ హీరోగా, గుహన్ దర్శకత్వంలో మహేష్ కోనేరు నిర్మించిన 118 సినిమాను చూసిన దిల్ రాజు ఇంప్రెస్ అయి ఆంధ్ర(సీడెడ్ మినహా), నైజాం హక్కులను కొన్నారు. ఇక సినిమాకు వచ్చిన టాక్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే నాలుగు రోజుల్లో తెలంగాణ, ఏపీల్లో 3 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసింది ఈ సినిమా. ఇక ప్రస్తుతానికి రిలీజ్ కు దగ్గర్లో సినిమాలు కూడా లేవు కాబట్టి మరో రెండు మూడు రోజుల్లో దిల్ రాజు కు తానుపెట్టిన మొత్తం ఎలాగూ వచ్చేస్తుంది. ఇక ఆ తరువాత వచ్చేది ప్రాఫిట్టే. దీంతో మరోసారి దిల్ రాజు సినిమాను అంచనా వేయడంలో దిట్ట అని నిరూపించాడు. గత ఏడాది కాస్త నిరాశపరిచినా.. ఈ ఏడాది మాత్రం బౌన్స్ బ్యాక్ అయినట్టు ప్రథమార్ధంలోనే ఎఫ్2, 118 సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. ఇంకా ఈ ఏడాది దిల్ రాజు లిస్ట్ లో పలు సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా సమ్మర్ లో మహర్షి సినిమా. మరి ఈ సినిమాలు కూడా మంచిగా హిట్టు కొట్టాలని.. మూడు బ్లాక్ బస్టర్ లు.. ఆరు హిట్ లతో దూసుకుపోవాలని ఆకాంక్షిద్దాం..
[youtube_video videoid=oS7vJJXcBng]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: