ఎన్నెన్నో ప్రత్యేకతల ప్రతిష్టాత్మక సాహసం సాహో

Interesting Facts About Prabhas Saaho Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Unknown Facts About Saaho Movie,Prabhas Saaho Movie Latest Updates,Interesting and Unknown Facts About Prabhas Saaho Movie,Prabhas Saaho Movie Latest News
Interesting Facts About Prabhas Saaho Movie

కొన్ని సినిమాలు ప్రారంభించినప్పటి పరిస్థితులకు, ప్రారంభించాక ఎదురయ్యే పరిణామాలకు పొంతనే ఉండదు. ఒక మోస్తరు బడ్జెట్ తో , మీడియం రేంజ్ సినిమాగా ప్రారంభమై అనూహ్యంగా మల్టీ క్రోర్స్ భారీ చిత్రంగా షేప్ తీసుకుంటాయి కొన్ని చిత్రాలు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేసిన బాహుబలి వన్ అండ్ టు , ఇప్పుడు తాజాగా చేస్తున్న “సాహో” చిత్రాల ప్రారంభ అంచనాలకు తరువాత పెరిగిన “నిర్మాణ పరిమాణా”లకు సంబంధమే లేదు. ప్రాంతీయ భాషా చిత్రాలుగా ప్రారంభమై ఇండియన్ ఫిలిం ట్రేడ్ మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యే భారీ ప్రాజెక్ట్స్ గా టర్న్ అయ్యాయి బాహుబలి సిరీస్ అండ్ సాహో చిత్రాలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘బాహుబలి 1’ అద్భుత విజయాన్ని సాధించటమే కాకుండా nail biting and hair plucking సస్పెన్స్ తో ఎండ్ అవటం వల్ల ‘బాహుబలి 2’ మీద అత్యంత భారీ అంచనాలు పెరిగిపోయాయి. Baahubali 2 కూడా అంతకు మించిన అఖండ విజయాన్ని సాధించడంతో దాని ప్రభావం “సాహో” నిర్మాణం మీద పడింది. దీనితో ‘సాహో’ ప్రారంభ సమయం నాటి అంచనాలు, ఆలోచనలు, సబ్జెక్టు, బడ్జెట్టు, రేంజ్ అన్నీ మారక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితిలో ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్ళటమా..? లేక మా వల్ల కాదు అని విరమించుకోవటమా..? ఈ రెండు ఆప్షన్స్ లో మొదటి ఆప్షన్ ను తీసుకుని ఆత్మవిశ్వాస ప్రపూరితంగా ముందుకు సాగింది “సాహో”టీం.

తత్ఫలితంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే అత్యంత ప్రతిష్టాత్మక భారీ యాక్షన్ థ్రిల్లర్ గా సంచలనం సృష్టిస్తున్నాయి ” సాహో” నిర్మాణ విశేష కథనాలు.

అవేమిటో పాయింట్ వైజ్ గా చూద్దాం.

* “షేడ్స్ ఆఫ్ సాహో” పేరుతో రెండు చాప్టర్స్ గా విడుదలైన మేకింగ్ విజువల్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. విడుదలయిన అతి తక్కువ కాలంలోనే హైయెస్ట్ వ్యూవర్షిప్ సాధించి సాహో ఎంత క్రేజీ ఎవైటెడ్ ప్రాజెక్టు అన్నది ప్రపంచానికి తెలియజేశాయి.

* అసలు ఒక సినిమా మేకింగ్ విజువల్స్ ను ఇలా ‘టు చాప్టర్స్’ గా రిలీజ్ చేసి బజ్ క్రియేట్ చేయటం ఒక సరికొత్త ప్రక్రియ. చాప్టర్ 1 ను హీరో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా గత అక్టోబర్ 23న రిలీజ్ చేయగా, చాప్టర్ 2 ను హీరోయిన్ శ్రద్ధా కపూర్ బర్త్డే అయిన మార్చి 3న రిలీజ్ చేశారు.

* చాప్టర్ 1 లో 30 రోజులపాటు అబుదాబిలో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాల విజువల్స్ ను షార్ప్ ఎడిటింగ్ తో కంపోజ్ చేసి ఒకటిన్నర నిమిషాల క్యాప్సూల్ గా రిలీజ్ చేశారు. ఇక చాప్టర్-2 లో మొత్తం సినిమాలోని ‘స్పెల్ బౌండింగ్’ థ్రిల్స్ తో పాటూ మేకింగ్ విజువల్స్ తో రూపొందించారు.

* షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 కు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా చాప్టర్2 కు గిబ్రాన్ మ్యూజిక్ అందించారు. ఇక మొత్తం సినిమాకు శంకర్ ఇషాన్ లాయ్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. కాగా పై రెండు చాప్టర్స్ ను నిఖిల్ నాదెళ్ల ఎడిట్ చేశారు.

* సుప్రసిద్ధ హిందీ నటుడు శక్తి కపూర్ కుమార్తె అయిన శ్రద్ధ కపూర్ దక్షిణాదిలో నటించిన తొలి చిత్రం
“సాహో” క్లిప్స్ తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు రావటం సంచలనం సృష్టించింది. ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యపెనింగ్ హీరోయిన్స్ గా, సింగర్ గా, మోడల్ గా పేరుపొందిన శ్రద్ధా కపూర్ ఫర్ ద ఫస్ట్ టైం ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించడంతో
” సాహో” క్రేజ్ రెట్టింపు అయింది.

* ఇక ప్రభాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో “సాహో” చిత్రాన్ని ఎనలైజ్ చేస్తే కేవలం ఒక స్టార్ ఇమేజ్ మీద బ్యాంక్ చేస్తూ 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఒక ఇండియన్ సినిమా రూపొందటం first of its kind అని చెప్పవచ్చు. బాహుబలి 1 రిలీజ్ నాటికి ప్రభాస్ ఎవరో తెలుగు ప్రేక్షకులకు తప్ప భారతీయ ప్రేక్షకులకు, ఇండియన్ ఫిల్మ్ ట్రేడ్ కు తెలియదు. బాహుబలి 2 రిలీజ్ నాటికి ప్రభాస్ కు ఇండియా వైజ్ గా గుర్తింపు వచ్చినప్పటికీ ఆ క్రెడిట్స్ లో ఎక్కువ శాతం దర్శక ధీరుడు రాజమౌళి ఎకౌంట్లోకి వెళ్ళిపోయాయి. ఇక ఇప్పుడు “సాహో” విషయానికి వచ్చేసరికి మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చూపు, అంచనాలు ప్రభాస్ మీదనే కేంద్రీకృతమయ్యాయి. భారతదేశపు టాప్ గ్రాసింగ్ స్టార్ గానే కాకుండా ప్రస్తుతం భారత దేశపు హై బడ్జెట్ సినిమా హీరోగా అంచనాల భారం మొత్తం ఈ ‘బాహుబలి’ భుజస్కంధాల మీదనే మోపబడింది.

* ఇక ఇంత భారీ చిత్ర దర్శకుడు ఎవరు అని ఆరా తీస్తున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కి ..he is one Mr Sujeeth… a just one picture old young director అనే సమాధానం రావటంతో అందరూ విస్తుపోతున్నారు.. ‘రన్ రాజా రన్’ అనే ఒకే ఒక్క సినిమాను డైరెక్ట్ చేసి what next అని ఎదురుచూస్తున్న కొత్త కుర్రాడికి ఇంత పెద్ద అవకాశం ఎలా వచ్చింది… అని ఆశ్చర్యపోతుంది ఇండియన్ ఫిలిం ట్రేడ్. అయితే బాహుబలి సిరీస్ కు ముందే ‘రన్ రాజా రన్’ చూసి మెచ్చిన ప్రభాస్ subject తయారు చేసుకోమని సుజిత్ కు చెప్పారట. అయితే అతను సజెక్ట్ తో సిద్ధమయ్యేటప్పటికి బాహుబలి టూ పార్ట్స్ విడుదలై సంచలనం సృష్టించాయి. అలాంటి తరుణంలో ఏ స్టార్ అయినా తర్వాత చేద్దాం.. చూద్దాం అని దాటవేస్తారు తప్ప ఇచ్చిన మాట ప్రకారం ఇంత పెద్ద మల్టీ క్రోర్స్ ప్రాజెక్టును జస్ట్ వన్ పిక్చర్ ఓల్డ్ యంగ్ డైరెక్టర్ చేతిలో పెట్టరు. అలా పెట్టడం వల్ల ఆ భారం మొత్తం తన భుజస్కందాలపైనే పడుతుందని తెలిసినప్పటికీ అత్యంత సాహసోపేతంగా “సాహో” చిత్రాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రభాస్ సాహసాన్ని చూసి ‘సాహో’అంటుంది ఇండియన్ ఫిలిం ట్రేడ్.

* ప్రారంభ అంచనాలు, ఆలోచనలు అనూహ్యంగా పెరిగిపోయి ” సాహో” చిత్రం నిర్మాణమే ఒక సాహసంగా మారిపోయిన పరిస్థితుల్లో ఏ మాత్రం జంకకుండా ఆ mighty mega project దర్శకత్వ బాధ్యతలను ధైర్యంగా స్వీకరించి టాలీవుడ్ మేకింగ్ స్టాండర్డ్స్ ను హాలీవుడ్ స్థాయిలో ఆవిష్కరిస్తున్న యంగ్ డైరెక్టర్ సుజిత్ ను అభినందిస్తుంది … ఆశీర్వదిస్తుంది ఎంటైర్ ఫిలిం దునియా.

* పదుల కోట్లు అనుకున్న నిర్మాణ వ్యయం వందల కోట్లు దాటుతుంటే మా వల్ల కాదు అని చేతులెత్తేయకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణానికి సాహసించిన యు.వి. క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ అండ్ విక్రమ్ ల నిర్మాణ దక్షతకు, ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు. ఒక ప్రాంతీయ భాషలో ప్లాన్ చేసిన చిత్రాన్ని తెలుగు,తమిళ, హిందీ భాషలలో ఏకకాలంలో విడుదల చేయటం ఒక గొప్ప అడ్వెంచరస్ మేకింగ్ అనే చెప్పాలి.

* బాహుబలి సిరీస్ అఖండ విజయం తరువాత భారతదేశంలో ఎంత పెద్ద సినిమా విడుదల అయినప్పటికీ ఆ చిత్ర జయాపజయాలను “బాహుబలి- నాన్ బాహుబలి” అనే కోణంలోనే విశ్లేషిస్తున్నారు. ఒక తెలుగు డబ్బింగ్ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ బాక్సాఫీస్ హిస్టరీలోనే ఒక అన్బీటబుల్ టార్గెట్ ను సెట్ చేయటం ఏమిటి అన్నది ఎవరికీ అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోయింది. అలాంటి టార్గెట్ కు ఫాలో అప్ ఫిలింగా రావటం “సాహో” యూనిట్ కు, ముఖ్యంగా సాహో స్టార్ ప్రభాస్ కు గొప్ప సవాల్. ఈ సవాలును ‘సాహో’ అవలీలగా అధిగమిస్తుందని ఆశిద్దాం.. అభినందిద్దాం.

[subscribe]

[youtube_video videoid=3gQXWLW3xV4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 2 =