`96`… గత ఏడాది తమిళనాట సంచలన విజయం సాధించిన చిత్రం. `ప్రేమ`ను `ప్రేమ`గా ప్రేమించేవాళ్ళంతా అందించిన విజయంగా… ఈ సినిమా ఫలితాన్ని వర్ణించారు సినీ విశ్లేషకులు. అలాంటి `96` ఇప్పుడు తెలుగు పలుకులతో అచ్చ తెలుగు వాతావరణంతో మరోసారి తెర రూపం దాల్చనుంది. తమిళ వెర్షన్ రూపకర్త సి.ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్‌ని కూడా రూపొందించనుండగా… ప్రముఖ నిర్మాత `దిల్` రాజు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నాడు. విజయ్ సేతుపతి, త్రిష పాత్రల్లో శర్వానంద్, సమంత దర్శనమివ్వనున్నారు. త్వరలోనే ఈ రీమేక్ వెర్షన్ పట్టాలెక్కనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాకి టైటిల్‌గా `జాను అలియాస్ జానకీదేవి` అనే పేరుని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో కథానాయిక పాత్ర పేరు జానకీ దేవి. అందుకే… ఆ పాత్ర పేరునే తెలుగులోనూ పునరావృతం చేస్తూ… టైటిల్‌గా కూడా అదే పేరుని ఫిక్స్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ టైటిల్‌పై క్లారిటీ వస్తుంది. కాగా… ఆగస్టు 29న ఈ సినిమా తెరపైకి రానుందని ఇన్‌సైడ్ సోర్స్ టాక్.
మరి… తమిళంలో ఘనవిజయం సాధించిన `96`… తెలుగులోనూ అదే మ్యాజిక్‌ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.
[youtube_video videoid=3DUXiGluVjo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: