స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త. 10 నెలల గ్యాప్ తరువాత అల్లు అర్జున్ వరుస సినిమా కమిట్ మెంట్స్ తో బిజీగా మారారు. గీతా ఆర్ట్స్, హారిక &హాసిని బ్యానర్స్ పై అల్లు అర్జున్ హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ మూవీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ పై ఒక మూవీ అనౌన్స్ అయింది. ఈ రెండు సినిమాలు త్రివిక్రమ్ -అల్లు అర్జున్, సుకుమార్ -అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూడవ మూవీ కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
త్రివిక్రమ్, సుకుమార్ సినిమాలతో పాటు మరో రెండు పెద్ద సినిమాలకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై AR మురుగదాస్ దర్శకత్వం లో తెలుగు, తమిళ భాషలలో రూపొందే చిత్రం, సౌత్ టాప్ డైరెక్టర్ దర్శకత్వం లో మరో సినిమా లో అల్లు అర్జున్ నటిస్తారని సమాచారం. అల్లు అర్జున్ ఎంపిక చేసుకున్న సినిమాలు డిఫరెంట్ జానర్ల లో రూపొందనుండటం విశేషం.
[youtube_video videoid=Y_sUze-_TZI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: