సర్వం తాళమయం తెలుగు ట్రైలర్ రిలీజ్

Sarvam Thaalamayam Telugu Trailer Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Sarvam Thaalamayam Telugu Trailer,Sarvam Thaalamayam Official Telugu Trailer,Sarvam Thaalamayam Telugu Movie Theatrical Trailer,Sarvam Thaalamayam Telugu Movie Latest Updates
Sarvam Thaalamayam Telugu Trailer Out Now

అటు మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు జీవి ప్రకాష్ కుమార్. తాను హీరోగా సంగీత నేపథ్యంలో తెరకెక్కిన కొత్త సినిమా సర్వం తాళమయం. రాజీవ్ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మెరుపు కలలు, ప్రియురాలు పిలిచింది వంటి క్లాసిక్ మూవీస్ ను అందించిన రాజీవ్ మీనన్.. మళ్లీ ఇన్నేళ్లకు ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమా ఇప్పటికే తమిళంలో రిలీజై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. వాయిద్యాలు తయారు చేసే కుటుంబంలో పుట్టిన కుర్రాడు సంగీత విద్వాంసుడు కావాలనుకుంటే అతనికి ఎదురైన కష్టాలు, అవమానాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్టు ట్రైలర్ ను చూస్తుంటే అర్ధమవుతోంది.

కాగా ఈ సినిమాలో జీవి ప్రకాష్ సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందించారు. మరి తమిళ్ లో మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈసినిమా తెలుగులో ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=7zkl9XDCdFk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 17 =