అనిల్ రావిపూడి… ప్రస్తుతం తెలుగునాట ఈ పేరే ఓ సంచలనం. చిత్ర చిత్ర ప్రవర్ధనమానంగా ఎదుగుతున్నాడీ యువ దర్శకుడు. `పటాస్`తో మొదలైన అనిల్ దర్శకప్రస్థానం… `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2`… ఇలా వరుస విజయాలతో ముందుకు సాగుతోంది. బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తున్న ఈ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్… తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో రూపొందించనున్న సంగతి తెలిసిందే. జూన్ లేదా జూలైలో పట్టాలెక్కనున్న ఈ మూవీ… సంక్రాంతికి విడుదల కానుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే… అనిల్ కెరీర్ బెస్ట్ హిట్ `ఎఫ్ 2` కూడా ఈ సంక్రాంతికి విడుదలై కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ సినిమా కూడా అదే సీజన్‌కి రానుండడం విశేషం. అంతేకాదు… `ఎఫ్ 2` సీక్వెల్ `ఎఫ్ 3` కూడా 2021 సంక్రాంతికి రాబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అంటే… వరుసగా మూడేళ్ళ పాటు అనిల్… సంక్రాంతి సీజన్‌ని టార్గెట్ చేసుకుంటున్నాడన్నమాట. మరి… `ఎఫ్ 2`కి అచ్చొచ్చిన సీజన్ అడ్వాంటేజ్… మున్ముందు కూడా కొనసాగుతుందేమో చూడాలి.
[youtube_video videoid=0yYIr6eYsHE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: