గత ఏడాది వేసవికి `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`తో పలకరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి… ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందివ్వకపోయినా నటుడిగా మాత్రం ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చింది. కాగా… భారీ విరామం తరువాత ఈ టాలెంటెడ్ హీరో… తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించనున్నాడు. ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం… ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్ళనుందని టాక్. అంతేకాదు… ఈ సినిమా చిత్రీకరణకు వెళ్ళకముందే… మరో ప్రాజెక్ట్‌కి కూడా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ఈ చిత్రం చేయనున్నాడు బన్నీ. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమాకి శ్రీకారం చుట్టనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే… తన కెరీర్‌లో ఇప్పటివరకు ఏ దర్శకుడితోనూ మూడు సినిమాలు చేయని అల్లు అర్జున్… అటు త్రివిక్రమ్‌తోనూ, ఇటు సుకుమార్‌తోనూ ఏకకాలంలో హ్యాట్రిక్ ఫిల్మ్స్ చేస్తుండడం విశేషం. `జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` తరువాత త్రివిక్రమ్‌తోనూ… `ఆర్య`, `ఆర్య2` తరువాత సుకుమార్‌తోనూ అల్లు అర్జున్ చేయనున్న ఈ మూడో చిత్రాలు… తన కెరీర్‌కి మరింత ప్లస్ అవుతాయేమో చూడాలి.
[youtube_video videoid=Y_sUze-_TZI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: