గత ఏడాది మార్చికి `కిరాక్ పార్టీ`తో పలకరించి అలరించిన యువ కథానాయకుడు నిఖిల్… ఈ సంవత్సరం మార్చికి `అర్జున్ సురవరం`తో సందడి చేయనున్నాడు. తమిళ హిట్ చిత్రం `గణితన్`కి రీమేక్‌గా రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్… ఈ నెల 29న సెల్యులాయిడ్ పైకి రానుంది. మహాశివరాత్రి సందర్భంగా నిన్న(సోమవారం) విడుదల చేసిన టీజర్… సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. కాగా… ఈ చిత్రం తరువాత కిషన్ దర్శకత్వంలో `శ్వాస` అనే ఇంట్రెస్టింగ్ మూవీని చేయనున్నాడు నిఖిల్. తాజాగా `118`లో ఆద్యగా అలరించిన టాలెంటెడ్ బ్యూటీ నివేదా థామస్ ఇందులో నాయికగా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… నిఖిల్ మరో ప్రాజెక్ట్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్ టాక్. గత ఏడాది గోపీచంద్ 25వ చిత్రం `పంతం`ని రూపొందించిన చక్రవర్తి.కె… తాజాగా నిఖిల్‌కి ఓ కథ చెప్పాడని… సబ్జెక్ట్ నచ్చడంతో నిఖిల్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి అంగీకరించాడని సమాచారం. త్వరలోనే ఈ కాంబినేషన్ మూవీపై క్లారిటీ వస్తుంది.
[youtube_video videoid=Q8O_RADN9U0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: